శివంపేటలో బీజేపీ నేతల ప్రత్యేక 'ప్రవాస్ అభియాన్' పర్యటన 

 శివంపేటలో బీజేపీ నేతల ప్రత్యేక 'ప్రవాస్ అభియాన్' పర్యటన 

శివంపేట (మెదక్): శివంపేట మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రవాస్ అభియాన్ 24 గంటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ సర్పంచ్ రాజేందర్ పాల్గొని పార్టీ సంస్థాగత బలోపేతం, రానున్న కార్యక్రమాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్ అధ్యక్షులు, బీఎల్‌ఏ-2 సభ్యులతో సమావేశమై పార్టీ విస్తరణ, ఓటర్ల నమోదు, బూత్ స్థాయి కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం రత్నాపూర్, రూప్ల తాండ, అల్లీపూర్, పిల్లుట్ల గ్రామాల పోలింగ్ బూత్‌లను సందర్శించి కార్యకర్తలతో మాట్లాడారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పెద్దపులి రవి, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమన్వయం తో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News