ఈ-కేవైసీ కి  నెలాఖరు వరకు మాత్రమే అవకాశం

ఈ-కేవైసీ కి  నెలాఖరు వరకు మాత్రమే అవకాశం

• ఈ-కేవైసీకు స్పందన అంతంతే.
• జిల్లాలో 71 శాతం ఈ-కేవైసీ పూర్తి – ఇంకా 29 శాతం పెండింగ్..!
• ఈకేవైసీ గడువులోగా పూర్తి చేసుకోవాలి : తాహశిల్దార్ తారా సింగ్.

తాండూరు (వికారాబాద్ జిల్లా) రేషన్ కార్డుదారుల కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ-కేవైసీ ప్రక్రియకు ఆశించిన స్థాయిలో స్పందన లభించడం లేదు.ఈ నెలాఖరు వరకు మాత్రమే అవకాశం ఉండటంతో మిగిలిన లబ్ధిదారులు వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు సుమారు 71 శాతం మంది మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నవి ప్రధానంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులేనని పేర్కొంటున్నారు. అయితే రేషన్ కార్డులో పేర్లు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను కాగితాల అవసరం లేకుండా డిజిటల్ విధానంలో పారదర్శకంగా అమలు చేయడమే ఈ-కేవైసీ లక్ష్యమని అధికారులు తెలిపారు. లబ్ధిదారుల వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా అర్హులకే ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అధికారుల సమాచారం ప్రకారం, ఈ-కేవైసీ పూర్తి చేసిన వారికే రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుంది. అలాగే వచ్చే నెలలో మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంకా ఈ-కేవైసీ చేయించుకోని కార్డుదారులు నెలాఖరులోపు సమీప రేషన్ దుకాణం లేదా సంబంధిత కేంద్రాన్ని సంప్రదించి ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.ఈ-కేవైసీ చేయించుకోని వారికి రేషన్ బియ్యం నిలిపివేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో కార్డుదారుల్లో అయోమయం నెలకొంది. అయితే అధికారులు మాత్రం ఈ-కేవైసీ ప్రక్రియను నిర్లక్ష్యం చేయవద్దని, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నెల 31వ తేదీతో గడువు ముగియనున్న నేపథ్యంలో ఇంకా ఈ-కేవైసీ చేయించుకోని కుటుంబ సభ్యులు వెంటనే సమీప రేషన్ దుకాణాన్ని సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు బయోమెట్రిక్ ధ్రువీకరణ చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డుల విషయంలోనే ఈ-కేవైసీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి కుటుంబాలు విడిపోయిన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. అయితే కార్డులు అందుకున్న అనంతరం కార్డులో పేర్లు ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ చాలామంది కొత్త కార్డు వచ్చిన వారు ఈ-కేవైసీ చేయించుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం చేశారు. మరికొన్ని కుటుంబాల్లో ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే ఈ-కేవైసీ చేయించుకోగా, మిగిలిన సభ్యులు ఇంకా చేయించుకోలేదు. వికారాబాద్ జిల్లాలో 83 వేల కొత్త కార్డులు జారీ అయ్యాయి. అయితే ఈ కొత్త కార్డుదారుల్లో గణనీయమైన సంఖ్యలో కుటుంబాలు ఇప్పటికీ ఈ-కేవైసీ పూర్తి చేయలేదు. ఈకేవైసీ గడువులోగా పూర్తి చేసుకోవాలి : తాహశిల్దార్ తారా సింగ్... రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా నిర్ణీత గడువులోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని తాండూర్ తహసీల్దార్ తారా సింగ్ సూచించారు. గడువు ముగిసేలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయని వారి రేషన్ సరఫరాపై ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ప్రజలు నిర్లక్ష్యం చేయవద్దని ఆయన తెలిపారు.  

Views: 93

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :  శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
సింగరేణిలో హౌసింగ్ పీడీ పర్యటన
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
వర్షానికి రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.
కొండగట్టులో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ అమలుపై రాష్ట్రస్థాయి ఆన్‌లైన్ శిక్షణ