క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక విప్లవం

'హైపర్‌సైట్'తో సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యం

క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక విప్లవం

  • రేడియేషన్ థెరపీలో గేమ్ ఛేంజర్‌గా మారిన అడాప్టివ్ థెరపీ
  • 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ తప్పనిసరి...
  • సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి వెల్లడి.

నాగర్ కర్నూల్ : క్యాన్సర్ మహమ్మారి అనగానే ఒకప్పుడు భయం.కానీ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో ఆ భయాన్ని పారద్రోలే రోజులు వచ్చాయి.క్యాన్సర్ చికిత్స అనగానే రోగులను తీవ్రంగా వేధించేది రేడియేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ (దుష్ప్రభావాలు)కానీ,సరికొత్త సాంకేతికత 'హైపర్‌సైట్' మెషిన్ రాకతో క్యాన్సర్ చికిత్సలో నవశకం మొదలైందని,దీని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ దాదాపు లేకుండా సురక్షితంగా చికిత్స అందించవచ్చని యశోద హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ స్రవంతి స్పష్టం చేశారు.క్యాన్సర్ ముప్పు,కారణాలు,నూతన చికిత్సా విధానాలపై ఆమె పలు కీలక విషయాలను పంచుకున్నారు. 'హైపర్‌సైట్'తో అద్భుత ప్రయోజనాలు క్యాన్సర్ కణాలను అంతం చేసే రేడియేషన్ థెరపీలో అడాప్టివ్ థెరపీ అనేది ఒక గొప్ప విప్లవమని డాక్టర్ స్రవంతి అభివర్ణించారు.అధునాతన 'హైపర్‌సైట్' మెషిన్ ద్వారా జరిగే ఈ చికిత్సలో అనేక సానుకూల అంశాలు ఉన్నాయని తెలిపారు.సైడ్ ఎఫెక్ట్స్‌కు ఈ నూతన విధానం ద్వారా చికిత్స చేయడం వల్ల రోగుల్లో 40% వరకు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి.అనవసరమైన కణజాలంపై రేడియేషన్ పడకుండా ఇది కాపాడుతుంది. బ్రీతింగ్ కంట్రోల్:రోగి శ్వాసను నియంత్రిస్తూ కచ్చితత్వంతో చికిత్స చేయడం దీని ప్రత్యేకత.దీనివల్ల చుట్టుపక్కల ఉండే ఆరోగ్యకరమైన అవయవాలకు ఎలాంటి నష్టం వాటిల్లదు.గంటల తరబడి యంత్రాల మీద ఉండాల్సిన అవసరం లేకుండా,ఈ ఆధునిక యంత్రం ద్వారా చికిత్స చాలా త్వరగా, సౌకర్యవంతంగా పూర్తవుతుంది.స్త్రీ,పురుషుల్లో క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు ఇవే..ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటానికి ప్రధానంగా మనజీవనశైలిలో వస్తున్న పెనుమార్పులే కారణమని డాక్టర్ స్రవంతి విశ్లేషించారు.పురుషుల్లో:మగవారిలో ఎక్కువగా ధూమపానం అలవాటు వల్లే శ్వాసనాళ,ఊపిరితిత్తుల క్యాన్సర్లు వస్తున్నాయి. పొగతాగడం మానేయడం ద్వారా ఈ ముప్పును చాలా వరకు నివారించవచ్చు. స్త్రీలలో: మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.అయితే ఇందులో సుమారు 10 శాతం కేసులు జన్యుపరమైన కారణాల వల్ల వస్తుండగా, మిగిలినవి జీవనశైలి, స్థూలకాయం తదితర కారణాల వల్ల వస్తున్నాయి.
 
 
Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 లక్ష్మారెడ్డి 27వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం లక్ష్మారెడ్డి 27వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం
శివంపేట( మెదక్): స్వర్గీయ వాకిటి లక్ష్మారెడ్డి 27వ వర్ధంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరంతో పాటు విద్యా వికాస్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మాజీ కో-ఆప్షన్ సభ్యులు...
విద్యార్థి మండలి ఎన్నికలతో నాయకత్వ లక్షణాలకు ప్రోత్సాహం.
అక్రమ షట్టర్లకు పంచాయతీ నంబర్లు..!
ఎయిడ్స్ పై రెండు నెలల పాటు అవగాహన కార్యక్రమం
పరకాలలో ఘనంగా తిరంగా ర్యాలీ
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ద్వారా ఎరువులు కొనుగోలులు రైతులకు శాపంగా మారాయి 
మంజీరా నీటిపై చార్మినార్‌ బేవరేజెస్‌ దోపిడీ?