ప్రభుత్వ భూముల గుర్తింపు లేనట్లేనా ?

ప్రభుత్వ భూముల గుర్తింపు లేనట్లేనా ?

బాల్కొండ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల స్థాయిలో ప్రభుత్వ భూముల గుర్తింపు సర్వే నిర్వహిస్తుండగా బాల్కొండలో ప్రభుత్వ భూముల గుర్తింపు సర్వే ఎందుకు జరగడం లేదని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ లో నిజామాబాద్ జిల్లా మానవ హక్కుల కౌన్సిల్ అధ్యక్షులు,సీనియర్ సిటిజెన్  తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ యన్. వై. పి, యి. యన్. వై. ఓ అధ్యక్షులు వి. సత్యగౌడ్ ముఖ్యమంత్రికి పంపిన వినతి పత్రంలో కోరారు. నిజామాబాదు జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజక వర్గం కేంద్రంలో ప్రభుత్వ భూములు ఎక్కువే ఆలా అని భూకబ్జా దారులుకూడా ఎక్కువే, నిజామాబాదు జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూముల గుర్తింపు సర్వే చేస్తున్నారు కానీ బాల్కొండ లో ఎందుకు చేయడం లేదని సత్య గౌడ్ రెవెన్యూ మరియు భూ కొలతల ఏ. డీ. ని ప్రశ్నిస్తు న్నారు.బాల్కొండ లో జే. సి. బి లతో త్రవేస్తూ ఒక వైపు మొరం దందాతో పాటు లెవెల్ అయిన భూము లకు ఎక్కడో ఉన్న పట్టా భూముకి బై నంబర్లు వేస్తూ ఫేక్ పట్టాలు సృష్టించు కొని పత్రికల్లో వార్తలు రాకుండా గప్ చుప్ వ్యవహారం నడుతస్తూ ఉంటె " భూ సర్వే శాఖ తో పాటు భూగర్భ శాఖ నీళ్ళోసు కుందా ? సీమంతం రెవెన్యూ వాళ్ళకా ? అనేటి ప్రశ్నలు ప్రజల్లో ఉన్నాయని " నర్సింగ్ రావు ఆరోపించారు.
విద్యుత్ కానెక్షన్ ఎలా ఇచ్చారూ ?
బాల్కొండ లోని ప్రభుత్వ గుట్టల్ని జే. సి. బి లతో త్రవ్వేసి లెవెల్ అయినా భూముల్లో వ్యవ సాయ సాగుకోసం విద్యుత్ అధికారులు విద్యుత్ పోల్స్ ఎలా ఇచ్చారని పైగా గత గ్రామ పంచాయతీ అధికారులు ప్రభుత్వ భూములకు ఓనర్ షిప్ ధ్రువపత్రాలు ఎలా  జారిచేసారని ఈ విషయంలో స్థానిక ప్రజలు బాల్కొండ కాంగ్రెస్ ఇంచార్జి ముత్యాల సునీల్ కు ఫిర్యాదు చేయడంతో 2024 ఫిబ్రవరి 13 నుండీ 26 వరకు (05) సర్వే బృందం లోని డివిజనల్ సర్వేయర్ శ్రీ వెంకటేశ్వర్లు నాయకత్వంలో ప్రభుత్వ భూముల గుర్తింపు సర్వే బృందంతో భూ కబ్జా దారులు ఉండ టంతో ప్రభుత్వ భూముల కబ్జాల బయటికి రాకుండా చేసారనే ఆరోపణలు రావడంతో "ప్రజావాణి"లొ జిల్లా కలెక్టర్ దృస్టికి తీసుక వెళ్లడంతో నిజామాబాదు నుండి సర్వే ల్యాండ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ హుటాహుటీనా బాల్కొండ కు విచారణ నిమిత్తo తేదీ 20-03-2024 బాల్కొండ కు రావడం తూ... తూ.. మంత్రంగా విచా రణ చేసి జిల్లా కలెక్టర్ కు ఏమని నివేదిక ఇచ్చారో ఈ రోజు వరకు తెలియదు.2024 ఫిబ్రవరి లో జరిగిన సర్వే రిపోర్ట్ (2) సంవత్సరాలు అయిపోతున్న రిపోర్ట్ మాత్రం ఈ రోజు వరకు బయటికి రాలేదని సత్యగౌడ్ ఆరోపించారు.
సర్వే చేశారు హద్దు రాళ్లు  ఎందుకు మరిచారో ?
బాల్కొండ లో  సర్వే జరిగి రెండు (02) సంవ త్సరాలు జరిగిన  ఇంతవరకు హద్దురాల్లు పాతకుండా అలాగే వదిలేశారు దీంతో భూ కబ్ధ దారులు రెచ్చిపోయి మళ్ళీ ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తూనే ఉన్నారు ఇప్పటి కైనా గ్రామ పంచాయతీ లేదా రెవిన్యూ గాని ప్రభుత్వ భూములు రక్షిస్తారా లేక భూకబ్జా దారులకు వదిలేస్తారా అనేది తేల్చాల్సి ఉంది.
భూకబ్జాలకు కారకులు ఏం. ఆర్. ఓ లేనా ?
1979 నుండి 2025 వరకు గతంలో పని చేసిన సర్వేయర్స్ తో పాటు 1979 పూర్వపు ఆర్మూర్ తహసీల్దర్,ఆ తర్వాత ఏం. ఆర్. ఓ లుగా పనీ చేసిన వారిలో ముఖ్యంగ నర్సింలు, చారి, సోమేశ్ కుమార్హ యాంలోనే బాల్కొండ లోని భూకబ్జా దారుల్లో "చౌ పస్లా (06) గాళ్ళే " తోడు.... దొంగ ల్లాగ "మారి పోయి సర్వే నoబర్స్ 1331,1332,1333, ప్రభుత్వ భూములు ఎక్కడో ఉన్న పట్టా భూములకు అ, ఆ, ఇ, ఈ,లుగా బై నంబర్స్ వేసి నకిలీ పట్టాలు సృష్టించి ఒక్కో నకిలీ పట్టాకు  రూ,75000/- రూ,2, 00,000/- లక్షలు కు పైగా వసూళ్ళు చేసారని, ప్రభుత్వ భూముల్లో భూ కొలతలు చూపించి నందుకు పూర్వపు సర్వేయర్లకు ఒక్కో నకిలీ పెట్టాకు రూ, 5,000/- నజరానా ముట్ట జెప్పునట్లు లబ్ధి దారులు ఆరోపిస్తున్నారు. ఇలా ప్రభుత్వ భూముల్ని  ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇల్లు నిర్మించి వాటిని మార్కెట్ ధరకు రెండింతల కు అమ్ము కోవడంతో భూ కబ్జా దారులు మూడు పువ్వులు ఆరు కాయలు గా చెలామణి అవుతూ నేడు "బెంజి కార్లో" దర్జాగా తిరుగు తున్నరు.పైగా సర్కార్, భూములే కాకుండ ఖిల్లా కోటకు ఆనుకొని కొన్ని వందల ఎకరాల కందకం ఉండేది 75% కందకము మొత్తము భూ కబ్జా దారులు పూడ్చి వేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టినారు. ప్రస్తుతము 25*/* శాతం కోటకు ఆనుకొని ఉత్తర భాగంలో కందకము మిగిలి ఉందని దీన్ని రక్షించు కోలేకుంటే పూర్వ కట్టడాలు అంతరించి పోయే ప్రమాదం ఉందని సత్య గౌడ్ ఆవేదన వ్యక్తం చేసారు.1979 నుండి 2025 వరకు బాల్కొండ లో పని చేసిన సర్వేయర్ లతో పాటు గతంలో పనీ చేసిన ఏం. ఆర్. ఓ లతో పాటు తహసీల్దార్ ల పై రాష్ట్ర ఉన్నత అధికారులతో నకిలీ పట్టాలు పరిశీలన చేసి శాఖ పరమైన విచారణ చెయ్యాలని సత్యగౌడ్ డిమాండ్ చేస్తున్నారు.
అన్ని పట్టాలు ఫారెన్సిక్ ల్యాబుకు పంపాలి 
బాల్కొండ లోని భూ కబ్జాల జిల్లా కలెక్టర్  ప్రత్యేక శ్రద్ద వహించి పట్టా భూములకు బై నుంబర్ తో ఉన్న అన్ని "ఫేక్ పట్టాలను " స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా పరిశీలన చేస్తే గాని బోకస్ "పట్టాల" వ్యవ హారం బయటికే వచ్చే అవకాశం ఉంది.
దాడులు చేస్తే తెలంగాణ అప్పు తీరుతుంది
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం బొకస్ పట్టాల హైడ్రా " చట్టాన్ని అమలు చేసి ప్రభుత్వ భూముల్ని భూ కబ్జాలు చేసిన వారిని గుర్తించి ప్రభుత్వా భూముల్ని  స్వాధీనం చేసుకోవా లని ప్రజలు పౌరులు, యువజన సంఘాల వారు కోరుచున్నారు. గతంలోని ప్రభు త్వాలు  రాష్ట్ర ఖజానా పై అప్పులుగ చిప్ప చేతికి ఇచ్చిన 600 వందల కోట్లాది రూపాయల అప్పులను తిరిగి రాబట్టూ కోవాలంటే ఒక్క బాల్కొండ లోని ఫేక్ పట్టాలను ఎన్ఫోర్స్మెంట్,పోలీసు, ఏ.సీ.బి శాఖల సమన్వయంతో బాల్కొండ లో ప్రభుత్వ భూకబ్జా దారులపై పై దాడులు చేస్తే తెలoగాణ ప్రభుత్వానికి 600 వందల కోట్ల రూపాయల లాభం వస్తుంది.

02

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగు-ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగు-ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగుపడిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంతో, ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే సంఖ్య కూడా పెరుగుతోందని మంత్రి...
ఆహార, ఔషధాల్లో కల్తీల నిరోధానికి కఠిన చట్టం-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నాణ్యమైన విద్య, క్రమశిక్షణకు చిరునామా కేజీబీవీ 
శుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
దౌల్తాబాద్ తాండాలో డెంగ్యూపై అప్రమత్తత చర్యలు
కొనాయిపల్లిలో ఘనంగా అక్షరాభ్యాసం కార్యక్రమం
19న జిల్లాస్థాయి తైక్వాండో ఛాంపియన్ సిప్ పోటీలు