కేజీబీవీ మిడ్జిల్‌లో అదనపు కలెక్టర్ తనిఖీ
మురుగునీరు నిల్వ లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచన
మిడ్జిల్, మిడ్జిల్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) మిడ్జిల్‌ను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నీరు, మురుగునీరు నిల్వ ఉండకుండా తగిన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు వర్షపు నీరు నిల్వ కాకుండా డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఈ తనిఖీలో జీసీడీఓ అస్రా ఫాతిమా ఖాద్రీ, ఎంపీడీఓ లక్ష్మణ్ రాథోడ్ , కేజీబీవీ యస్ ఓ ఏ కవిత, గ్రామ సర్పంచ్ ఎడ్ల శంకర్ , పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు, వార్డు సభ్యులు వెంకటయ్య,సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు, పాఠశాల సిబ్బంది అదనపు కలెక్టర్‌కు పాఠశాలలోని పరిస్థితులను వివరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


