అఖిల భారత యాదవ మహాసభ
సమావేశంనకు బయలుదేరిన జిల్లా నాయకులు
నాగర్ కర్నూల్ : ఆల్ ఇండియా యాదవ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది.రాష్ట్ర నలుమూల నుంచి యువజన నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సమావేశానికి నాగర్‌కర్నూల్ జిల్లా యూత్ అధ్యక్షుడు మూర్తి యాదవ్ జిల్లా నాయకులు కాటమోని.శ్రీనివాస్ యాదవ్,తిరుపతయ్య యాదవ్,బిజినపల్లి మండల అధ్యక్షుడు భక్క.మల్లేష్ యాదవ్,తిమ్మాజిపేట అధ్యక్షుడు శేఖర్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.ఈ సమావేశంలో యాదవ సామాజికవర్గ అభివృద్ధి కోసం యువత అందరూ ఐక్యంగా ఉండి సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.విద్య,ఉద్యోగ,వ్యాపార రంగాల్లో యాదవ యువత ముందుకు రావాలని సూచించారు.యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు.రాజకీయంగా యాదవులకు తగిన గుర్తింపు కల్పించాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో యాదవ యువతకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని,పార్టీల్లో కీలక పదవులు ఇవ్వాలని తీర్మానం చేశారు.యాదవ యువత పేరు చివర కచ్చితంగా యాదవ్ అని ఉండేలా చూసుకోవాలని సంఘం నిర్ణయించింది.దీని ద్వారా యువతలో సామాజిక స్పృహ పెరుగుతుందని నాయకులు అన్నారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ రాష్ట్ర యువజన విభాగం కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.ఈ సమావేశం యాదవ యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని,రాబోయే రోజుల్లో సంఘం మరింత బలంగా ముందుకు వెళ్తుందని రాష్ట్ర నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Jul 2026 20:44:32
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా....
