బిజెపి ఓబీసీ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం
పాల్గొన్న రాష్ట్ర ఓబిసి అధ్యక్షుడు ఆనంద్ గౌడ్
మంచిర్యాల (టౌన్) మంగళవారం మంచిర్యాల పట్టణంలోని బిజెపి ఓబీసీ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల కుటుంబాల కోసం ఉచిత కంటి పరీక్షా శిబిరం ను రాష్ట్ర ఓబీసీ అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముందు గా రిబ్బన్ కట్ చేసి బస్ స్టాండ్ ఎదురుగా సీఎంఆర్ షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ లో కార్యక్రమం నిర్వహించారు తెలం గాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖేష్ గౌడ్ ఆధ్వర్యంలో , పవన్ ఆప్టికల్ సౌజన్యంతో_ నిర్వహించడం జరిగింది. ఆటో కార్మికుల కుటుంబాల తల్లిదండ్రులకు మరియు వారి పిల్లలతో సహా కంటి పరీక్షలు, ఆపరేషన్స్ అలాగే కంటి అద్దాలు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రఘనాధ్ వేరబెల్లి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లా బిజెపి అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ నగునూరి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మరియు, ఆటో కార్మికులు మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


