వేపచెట్టు వివాదం.. ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఇద్దరు మృతి..
మేళ్ళ చెరువు./ సూర్యాపేట : మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో వేపచెట్టు వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. గొడ్డళ్లతో రాము అనే వ్యక్తి మంద వెంకటేశ్వర్లు పై దాడి చేయగా అక్కడే ఉన్న తన తండ్రి సైదా పై కూడా దాడి చేయడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘర్షణలో మంద వెంకటేశ్వర్లు యాదవ్ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన భూక్యా సైదాను 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం. పాత కక్షలతో పాటు ప్రస్తుతం వేపచెట్టు విషయంలో తలెత్తిన వివాదం తీవ్రరూపం దాల్చడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది... రాము అనే వ్యక్తి ఇద్దరిపై గొడ్డలితో దాడి చేసినట్లు స్థానికుల నుంచి సమాచారం. మృతుల్లో రాము తండ్రి సైదా కూడా ఉన్నారు .ఈ ఘటనతో ఎర్రగడ్డ తండాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పలువురు పోలీసులపై రాళ్లు రావడంతో మేళ్లచెరువు ఎస్సై నవీన్ కుమార్ తలకు గాయాలు కావడంతో హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ పరిస్థితి తెలిసిన వెంటనే పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


