గురుకుల పాఠశాల విద్యార్థి ఆత్మహత్యాయత్నం
- హస్టల్ లో ఉండటానికి ఇష్టం లేక పురుగుల మందు తాగిన విద్యార్థి.
- పాఠశాల పరిసరాల్లో పురుగుల మందు తాగిన ఘటన.
కుల్కచర్ల, వికారాబాద్: పాఠశాలలోని హస్టల్ లో ఉండటానికి ఇష్టం లేక ఓ విద్యార్థి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన బండవెల్కిచర్ల గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో నిన్న మంగళవారం చోటు చేసుకుంది. ప్రిన్సిపల్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం...షాద్ నగర్ సమీపంలోని కుల్చర్లకుంట తండాకు చెందిన తారక్ తేజ్ అనే విద్యార్థి వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో పదవ తరగతి చదుతున్నాడు. తనకు హాస్టల్ లో ఉండటానికి ఇష్టం లేదని టీసీ ఇవ్వాలని గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయులను అడుగుతున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థి తండ్రి శ్రీను చెప్పాడు. విద్యార్థి తారక్ తేజ్ శనివారం తన ఇంటికి వెళ్లిపోయి సోమవారం ఉదయం తిరిగి పాఠశాలకు వచ్చాడు. పాఠశాలకు వచ్చే క్రమంలో తన వెంట పురుగుల మందు డబ్బా తెచ్చుకున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం ప్రార్థన, తరగతులకు విద్యార్థి వెళ్లలేదు. ఉపాధ్యాయులు వెతకగా టీచర్స్ క్వార్టర్స్ గదుల వెనుక పురుగుల మందు తాగి పడిపోయినట్లు గుర్తించారు. వెంటనే కుల్కచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్సను అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. విద్యార్థి ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు ప్రిన్సిపల్ తెలియజేశారు.
Views: 9
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Aug 2026 18:12:49
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
