ప్రజా సమస్యలు పట్టించుకునే అభ్యర్థికే మద్దతు

ప్రజా సమస్యలు పట్టించుకునే అభ్యర్థికే మద్దతు

 తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం స్పష్టం

హన్మకొండ న్యూస్ : రాబోయే మార్చి నెలలో జరగనున్న వరంగల్ - ఖమ్మం - నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎం.ఎల్.సి. (ఎం . ఎల్.సి .) ఎన్నికలలో పట్టభద్రులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు,  లెక్చరర్లు ఆలోచించి, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసే అభ్యర్థినే ఎన్నుకోవాలని తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు,  ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ కుందూరు గోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.  ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, గతంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారని, ప్రజల సమస్యలను విస్మరించారని విమర్శించారు. ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 2 శాతం మాత్రమే ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై శ్రద్ధ చూపుతున్న పాలకులు, మిగిలిన 98 శాతం సాధారణ ప్రజల, పెన్షనర్ల సమస్యలను పూర్తిగా పక్కన పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  

స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి నిర్ణయం

సహకార శాఖలో సీనియర్ ఇన్‌స్పెక్టర్, ఆడిటర్‌గా పనిచేసి నలభై ఏళ్లకు పైగా ప్రజాసేవలో ఉన్న తనకు ప్రజల మరియు పెన్షనర్ల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని గోపాల్ రెడ్డి తెలిపారు. తెలంగాణ తొలి మరియు మలి దశ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న అనుభవం తనకు ఉందని, రాజకీయ ప్రయోజనాలు కాకుండా కేవలం ప్రజాసేవే లక్ష్యంగా రాబోయే ఎమ్మెల్సీ  ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.   పట్టభద్రులందరూ ఓటు హక్కును పొంది, విజ్ఞతతో ఆలోచించి ప్రజాసేవా దృక్పథం కలిగిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పెన్షనర్స్ అధ్యక్షులు కుందూరు గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పిండి కుమారస్వామి, వైస్ ప్రెసిడెంట్ పగడాల సరళ, కార్యదర్శి ఎల్లంభట్ల శేషయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ ముదిగంటి వెంకటేశ్వర్లు,  యూనిట్ అసోసియేట్ ప్రెసిడెంట్ గన్నోజు సదానంద చారి, జాయింట్ సెక్రెటరీలు కుందూరు జగదీశ్వర్ రెడ్డి,  నోముల ప్రభాకర్ రెడ్డి,  కార్యవర్గ సభ్యులు కొండం రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

భీమ్‌రెడ్డి కేసులో బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు  భీమ్‌రెడ్డి కేసులో బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు 
హైదరాబాద్: సస్పెండైన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసింది. భీమ్‌రెడ్డికి బినామీలుగా అనుమానిస్తున్న ఎనిమిది మంది ఇళ్లలో...
సీనియర్ జర్నలిస్ట్ కొప్పు నర్సింహులు పదో వర్ధంతి
రిమ్స్ ను సందర్శించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు 
భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు
సుల్తాన్‌పూర్‌లో అంగరంగ వైభవంగా కోలాటాల కార్యక్రమం
ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్ ఖోఖోఎంపికలు..:మెదక్ జిల్లా అధ్యక్షుడు హరికిషన్ 
ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష