శుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం

శుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం

దౌల్తాబాద్, సిద్ధిపేట : ప్రభుత్వ జూనియర్ కళాశాల, దౌల్తాబాద్‌లో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో శనివారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కళాశాల ఆవరణను పరిశుభ్రపరచడంతో పాటు మొక్కల సంరక్షణ చేపట్టి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మధు శ్రీవాస్తవ మాట్లాడుతూ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఎన్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని తెలిపారు. కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. ఎం. మంగత, ఎం. సంపత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్టూడెంట్ కౌన్సిలర్ శివకుమార్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగు-ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగు-ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగుపడిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంతో, ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే సంఖ్య కూడా పెరుగుతోందని మంత్రి...
ఆహార, ఔషధాల్లో కల్తీల నిరోధానికి కఠిన చట్టం-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నాణ్యమైన విద్య, క్రమశిక్షణకు చిరునామా కేజీబీవీ 
శుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
దౌల్తాబాద్ తాండాలో డెంగ్యూపై అప్రమత్తత చర్యలు
కొనాయిపల్లిలో ఘనంగా అక్షరాభ్యాసం కార్యక్రమం
19న జిల్లాస్థాయి తైక్వాండో ఛాంపియన్ సిప్ పోటీలు