నాణ్యమైన విద్య, క్రమశిక్షణకు చిరునామా కేజీబీవీ
కారేపల్లి (ఖమ్మం): కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకై అర్హత కలిగిన బాలికల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు కళాశాల స్పెషల్ ఆఫీసర్ ఝాన్సీ సౌజన్య తెలిపారు. శనివారం కళాశాలలో ఆమె మాట్లాడుతూ.. కస్తూర్బా పాఠశాల కళాశాలలో ఏడవ తరగతిలో 3, ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 2, బైపీసీలో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశానుసారం ఈ సీట్లను భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు.విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యతో పాటు ఉచిత వసతి,పోష్ఠికాహరం,పాఠ్య పుస్తకాలు,నోట్ బుక్స్, యూనిఫాంలు ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు.మహిళా సిబ్బంది పర్యవేక్షణలో సురక్షిత వాతావరణంలో విద్యను అందించడంతోపాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా క్రమశిక్షణ,నాయకత్వ లక్షణాలను పెంపొదిస్తున్నట్లు తెలిపారు.ఆసక్తిగల విద్యార్థుల తల్లిదండ్రులు అవసరమైన దువికరణ పత్రాలతో పాఠశాల పని దినాల్లో నేరుగా కేజీబీవీ విద్యాలయాన్ని సంప్రదించవచ్చని ఆమె తెలిపారు.
Views: 14
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
19 Jul 2026 00:48:51
ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగుపడిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంతో, ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే సంఖ్య కూడా పెరుగుతోందని మంత్రి...
