విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఛాత్రోన్ కి గూంజ్ పోరాటం
మధిర,:ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఛాత్రోన్ కి గూంజ్ కార్యక్రమంలో భాగంగా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ గారి అధ్వర్యంలో నిర్వహించించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ యూజీసీ-నెట్ పేపర్ లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి విద్యార్థులు తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలి, కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.. ఇప్పుడు మనం చేసే ఈ పోరాటం కేంద్ర విద్యా వ్యవస్థలో మార్పులు తో పాటు ఇతర జాతీయస్థాయి పోటీ పరీక్షల పేపర్ తప్పిదాలకు బాధ్యులైన వారిని పదవుల నుంచి తొలగించాలని శిక్షించాలని డిమాండ్ చేశారు..పేపర్ లీకులు నిరుద్యోగ సమస్య కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపులతో విద్యార్థులు యువత దేశవ్యాప్తంగా ఛాత్రోన్ కి గూంజ్ కార్యక్రమంలో భాగస్వామ్యులు అవుతున్నారన్నారు.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా పారదర్శకమైన పరీక్ష విధానాన్ని అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కర్నాటి రామారావు తదితరులు పాల్గొన్నారు
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
19 Jul 2026 00:48:51
ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగుపడిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంతో, ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే సంఖ్య కూడా పెరుగుతోందని మంత్రి...
