గురుపౌర్ణమి ఉత్సవాలకు మర్పల్లి సాయిబాబా ఆలయం ముస్తాబు
- ఈ నెల 29న ప్రత్యేక పూజలు, హారతులు, అభిషేకాలు, అన్నదానం
- భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సేవా సమితి పిలుపు
మర్పల్లి, (వికారాబాద్ జిల్లా): మర్పల్లి మండల కేంద్రంలోని సద్గురు షిర్డి సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి ఉత్సవాలను ఈ నెల 29వ తేదీ బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ షిర్డి సాయిబాబా సేవా సమితి సభ్యులు తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఆశాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ఉదయం 5.15 గంటలకు ధ్వజారోహణం, కాకడ హారతితో ఉత్సవాలు ప్రారంభం కానుండగా, ఉదయం 7.30 గంటలకు శ్రీ షిర్డి సాయిబాబాకు మంగళస్నానం, శ్రీ రామలింగేశ్వర స్వామికి మహాభిషేకం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు మధ్యాహ్న హారతి అనంతరం తీర్థప్రసాదం, మహా అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నారు. సాయంత్రం 6.15 గంటలకు ధూప హారతి, రాత్రి 7.30 గంటలకు శేజ హారతి నిర్వహించి, అనంతరం భజన కార్యక్రమాలు జరగనున్నాయి.ఈ సందర్భంగా సాయినాథుని ఏకాదశ సూత్రాలను భక్తులకు వివరిస్తూ, గురుపౌర్ణమి రోజున సాయిబాబా పాద దర్శనం చేసుకోవడం విశేష పుణ్యఫలాన్ని అందిస్తుందని సేవా సమితి సభ్యులు పేర్కొన్నారు. భక్తులు తమలోని అజ్ఞానాన్ని తొలగించుకొని, ఆధ్యాత్మిక చింతనతో గురుపౌర్ణమి వేడుకల్లో పాల్గొని సాయినాథుని కృపాకటాక్షాలు పొందాలని కోరారు. "అన్నదానమే నారాయణ సేవ" అనే భావనతో నిర్వహించే మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి మర్పల్లి పరిసర గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో హాజరై సద్గురు షిర్డి సాయిబాబా వారి ఆశీస్సులు పొందాలని శ్రీ షిర్డి సాయిబాబా సేవా సమితి, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు.
Views: 13
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Jul 2026 20:44:32
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా....
