జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వన మహోత్సవం, శ్రమదానం కార్యక్రమం
కొత్తగూడెం, : జిల్లా కేంద్ర గ్రంథాలయం, భద్రాద్రి కొత్తగూడెంలో సోమవారం సాయంత్రం వన మహోత్సవం, శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రంథాలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయ పరిసరాల్లో శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు, విషపురుగుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యకరమైన జీవనం సాగించాలని విద్యార్థులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, కాలుష్యం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజూ మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణలో విశేష సేవలందించి, 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకున్న కె.ఎన్. రాజశేఖర్‌ను ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఆయన సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేడ్-2 గ్రంథపాలకురాలు సూరేపల్లి లలిత కుమారి, గ్రంథపాలకురాలు జి. మణి మృదుల, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.
Views: 56
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Jul 2026 20:44:32
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా....
