అన్నదాతల కళ్లలో వెలుగులు

అన్నదాతల కళ్లలో వెలుగులు

చర్ల, (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): చర్ల, దుమ్ముగూడెం మండలాల రైతుల సాగునీటి అవసరాలను తీర్చేందుకు చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి అధికారులు సాగునీటిని అధికారికంగా విడుదల చేశారు,భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్వయంగా ప్రాజెక్టు వద్దకు చేరుకుని, పూజా కార్యక్రమాలు చేసి, తాలిపేరు ప్రాజెక్టు కుడి మరియు ఎడమ కాలువ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు
ప్రాజెక్టు ప్రాముఖ్యత
గోదావరి నదికి ఉపనదిగా ఉన్న తాలిపేరుపై పెదమిడిసిలేరు గ్రామం వద్ద నిర్మించిన ఈ మధ్యతరహా ప్రాజెక్టు, సుమారు 24,500 ఎకరాల ఆయకట్టుకు జీవనాధారంగా నిలుస్తోంది. 5.0 టి ఎం సి సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు నిండుకుంటే రైతులు పంటల సాగులో ఎటువంటి కొరత ఎదుర్కోరు, ఎగువ నుంచి వచ్చే నీటిని సద్వినియోగం చేస్తూ, అదనపు వరద సమయాల్లో అప్రమత్తంగా ఉండి నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు వివరించారు
రైతుల సంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్యే
సాగునీటి విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ, వ్యవసాయమే ఈ ప్రాంత ప్రజల ప్రధాన జీవనాధారం. రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకూడదన్నదే మా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం, సకాలంలో సాగునీరు అందించడం ద్వారానే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చగలం, నాటి నుంచి నేటి వరకు రైతుల సమస్యలను పరిష్కరించడం మా బాధ్యతనీ, ఈ నీటిని ప్రతి రైతు సద్వినియోగం చేసుకుని, పంటలను సమృద్ధిగా పండించి ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నాననీ. ప్రభుత్వం ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది అని భరోసానిచ్చారుఈ కార్యక్రమంలో తాలిపేరు ప్రాజెక్టు అధికారులు ఎస్ ఈ మహేశ్వరరావు, ఈ ఈ సయ్యద్ అహ్మద్ జానీ, డి ఈ ఈ లు తిరుపతి. జే, భాగ్యరాజు రాథోడ్, ఏ ఈ ఈ సంపత్ బి, ఎల్. సూర్యం , చర్ల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ నాయుడు సీనియర్ నాయకులు బ్రహ్మానంద రెడ్డి , లంక రాజు ,సీతాపతి రాజు , కాంగ్రెస్ పార్టీ నాయకులు,మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.

IMG-20260717-WA1746(1)

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగు-ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగు-ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగుపడిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంతో, ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే సంఖ్య కూడా పెరుగుతోందని మంత్రి...
ఆహార, ఔషధాల్లో కల్తీల నిరోధానికి కఠిన చట్టం-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నాణ్యమైన విద్య, క్రమశిక్షణకు చిరునామా కేజీబీవీ 
శుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
దౌల్తాబాద్ తాండాలో డెంగ్యూపై అప్రమత్తత చర్యలు
కొనాయిపల్లిలో ఘనంగా అక్షరాభ్యాసం కార్యక్రమం
19న జిల్లాస్థాయి తైక్వాండో ఛాంపియన్ సిప్ పోటీలు