ఉమిత్యాల గ్రామంలో కోతుల బెడద
కేటిదొడ్డి : జోగులాంబ గద్వాల జిల్లా కే.డి.దొడ్డి మండలం ఉమిత్యాల గ్రామంలో గత 5 సంవత్సరాల నుండి కోతులు బెడదా కొనసాగుతూనే ఉన్నది. ఇళ్లలోకి వెళ్లి సంచారం చేస్తున్నాయి. అలాగే గ్రామంలో వృద్దులు చిన్న పిల్లలను భయ భ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే, నేడు ఉమిత్యాల గ్రామంలో రంగన్న ఇంటి దగ్గర వేప చెట్టు కింద ముగ్గురు మహిళలు కూర్చొని ఉండగా 10 కోతులు ఆ చెట్టు పై ఎగరడం దుంకడం వేప చెట్టు కొమ్మ విరిగి మహిళల మీద పడింది. ఆ ముగ్గురి (రంగమ్మ, గోవిందమ్మా, లాలేమ్మా ) మహిళలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. జులై 10 వ తారీకు గద్వాల ఎమ్మెల్యే నిర్వహించిన డయల్ యువర్ గద్వాల ఎమ్మెల్యే ప్రోగ్రాంలో ఉమిత్యాల గ్రామస్తులు కోతులకు సంబంధించిన విషయాన్ని కూడా విన్నవించారు ఎమ్మెల్యే స్పందించి త్వరలోనే కోతుల బెడద లేకుండా చూస్తాం అని చెప్పడం జరిగిందని గ్రామ ప్రజలు తెలిపారు. ఎమ్మెల్యే చెప్పి పది రోజులు కూడా కాలేదు మళ్లీ కోతులు యధావిధిగా గ్రామంలో సంకరిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తలు, కోతుల నుండి మాకు రక్షణ కల్పించండి అని సంబంధిత అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 12:25:58
లింగాల గణపురం (జనగామ): కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
