క్రీడాకారుడు సుశాంత్ కు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
తాండూరు (వికారాబాద్ జిల్లా) గత కొన్ని రోజుల క్రితం బషీరాబాద్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో జోనల్ స్థాయి క్రీడా పోటీలు జరుగుతుండగా విద్యార్థి సుశాంత్ పై చెట్టు కొమ్మ అకస్మాత్తుగా విరిగి తలపై పడి, తలకు గాయమై హైదరాబాద్ లోని ఆలివ్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవలే కోలుకున్న సుమంత్ కు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రూ.1,43,200/- విలువ గల చెక్కును క్యాంప్ కార్యాలయంలో అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో చికిత్స ఖర్చుల నిమిత్తం వ్యక్తిగతంగా రూ.20,000/- వేల ఆర్థిక సహాయం విద్యార్థి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సుశాంత్ కుటుంబ సభ్యులు మాకు అన్ని విధాలుగా అండగా నిలిచి, మా కుటుంబానికి సహకారం అందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు.
Views: 32
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 12:25:58
లింగాల గణపురం (జనగామ): కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
