తలమడుగు, దేవాపూర్ గ్రామాలలో 26 సీసీటీవీ కెమెరాల ప్రారంభం.
- ఉమ్రి గ్రామంలో 'పోలీసులు మీకోసం' కార్యక్రమం.
- గంజాయిపై యుద్ధం చేయాలి..
- మార్పు ద్వారానే గంజాయిని దూరం చేయవచ్చు.
- జిల్ ఎస్పి అఖిల్ మహాజన్
- 15 మంది వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ..
- గ్రామస్తులకు వాలీబాల్ కిట్స్ అందజేసిన
- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్ : ప్రజలకు మరింత చేరువై వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం, గ్రామాల్లో పోలీసు-ప్రజల సత్సంబంధాలను బలోపేతం చేయడం, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'పోలీసులు మీకోసం' కార్యక్రమంలో భాగంగా మంగళవారం తలమడుగు మండలం ఉమ్రి గ్రామంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉమ్రి గ్రామ ప్రజలు సాంప్రదాయ ఆదివాసి డేంశ నృత్యంతో జిల్లా ఎస్పీని ఘనంగా ఆహ్వానించారు, గ్రామ మహిళలు జిల్లా ఎస్పీకి రాఖిని కట్టి రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామంలో ఉన్న కుమురం భీం విగ్రహానికి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి గ్రామంలో ఏర్పాటు చేసిన "పోలీసులు మీకోసం" కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా ఎస్పీతో పాటు పోలీసు అధికారులకు గ్రామ మహిళలు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవాపూర్ మరియు తలమడుగు గ్రామాలలో ఏర్పాటు చేసిన 26 సీసీటీవీ కెమెరాలను గ్రామస్తులతో కలిసి జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ప్రతి గ్రామం సీసీటీవీ నిఘాలో ఉంటే నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని అన్నారు. గ్రామ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, సీసీటీవీలు ప్రజల రక్షణకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొంటూ సీసీటీవీల ఏర్పాటుకు సహకరించిన గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై గ్రామ ప్రజలు, యువతకు అవగాహన కల్పించారు. "గంజాయిపై యుద్ధం చేయాలి.. మార్పు వల్లే గంజాయిని సమాజం నుంచి దూరం చేయవచ్చు" అని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. గ్రామాల్లో ఎవరైనా గంజాయి సాగు చేస్తున్నా లేదా మాదకద్రవ్యాల వ్యాపారం నిర్వహిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల సహకారం అత్యంత అవసరమని, గంజాయి రహిత సమాజ నిర్మాణమే జిల్లా పోలీసుల లక్ష్యమని తెలిపారు. చదువు పట్ల ఉన్న ఆవశ్యకతను తెలియజేశారు విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి అని తెలిపారు. చదువు వల్ల భవిష్యత్తు మారుతుందని తెలిపారు. నకిలీ బాబాలను, మంత్రాలను తంత్రాలను ఎలాంటి వైద్య అవసరం ఉన్న, ప్రభుత్వం గుర్తించిన ప్రభుత్వ ప్రైవేటు వైద్యులను సంప్రదించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణనష్టానికి దారితీస్తుందని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్ వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా 15 మంది వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. కోసాయి విజయ హనుమాన్ టెంపుల్ లో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ప్రారంభించారు.
దాదాపు ఆరు రంగాలలో నిష్ణాతులైన ఆదిలాబాద్ లోని ప్రైవేటు వైద్యుల బృందం చే గ్రామస్తులందరికీ ఉచితంగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని ఈ క్యాంపులో 250 మంది గ్రామస్తులు పాల్గొని జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్, గైనకాలజీ, ఆప్తమాలజీ, డెంటల్, పీడియాట్రిషన్ విభాగాలలో వైద్య పరీక్షలను ఉచితంగా మందులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోసాయి, జరీ, ఉమ్రి గ్రామాలకు చెందిన 250 మంది గ్రామస్తులు మహిళలు వృద్దులు చిన్నారులు పాల్గొని వైద్య పరీక్షలను చేయించుకున్నారు.
మండల స్థాయి కబడ్డీ పోటీల విజేతలకు బహుమతులు.అందజేశారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని, క్రీడలు క్రమశిక్షణ, ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. రెండు రోజుల పాటు నిర్వహించిన మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ విజేతలకు జిల్లా ఎస్పీ నగదు బహుమతులు, ట్రోఫీలు, మెడల్స్ అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా కబడ్డీ క్రీడాకారులతో కాసేపు కబడ్డీ ఆడి వారిని ఉత్సాహపరిచారు.
విజేతలు : ప్రథమ బహుమతి : కోసాయి గ్రామ జట్టు – 5 వేల నగదు బహుమతి, ట్రోఫీ.
ద్వితీయ బహుమతి : ఝరి గ్రామ జట్టు – 3 వేల నగదు బహుమతి, ట్రోఫీ.
తృతీయ బహుమతి : పాల్సి కె గ్రామ జట్టు, 2 వేల నగదు బహుమతి, ట్రోఫీ. లను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, రూరల్ సీఐ రహీం పాషా, తలమడుగు ఎస్ఐ డి రాధిక, పట్టణ డాక్టర్లు చంద్రశేఖర్ రెడ్డి, సందీప్ రెడ్డి, శిల్పా సందీప్, అనిషా, భార్గవ్ కృష్ణ, శ్రీనివాసచారి, ఉమ్రి సర్పంచ్ మెస్రం సావిత్రిబాయి, కోసాయి గ్రామ సర్పంచ్ శైలజ, గ్రామ పెద్దలు పెందూరు వనమాల, కుమ్ర రామారావు, పెందూరు మాధవరావు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, మహిళలు, యువతతో పాటు సుమారు 250 మంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


