జులై 22 న రైతాంగ నిరసనలను జయప్రదం చేయండి

జులై 22 న రైతాంగ నిరసనలను జయప్రదం చేయండి

గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో రైతు సంఘాలు, (ఏకేఎంఎస్,ఎస్ కే ఎం) సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ రాష్ట్ర కన్వీనర్ జక్కుల వెంకటయ్య,ఎస్ కే యం రాష్ట్ర నాయకులుజి గోపాల్, జిల్లా ఏకేఎంఎస్ జమ్మిచెడు కార్తీక్, జిల్లా నాయకులు, ఆశన్నలు మాట్లాడుతూ  స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో భాగంగా సామ్రాజ్యవాద దేశాలు మన దేశ రైతాంగాన్ని దోచుకునే విధంగా మన దేశ పాలకులు రైతులకు వ్యతిరేకమైన నిర్ణయాలు చేస్తున్నారని, వీటికి నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీన అమెరికా అధ్యక్షుడు ట్రంపు, మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని, దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్మోర్చా పిలుపుని చ్చింది. మన పాలకులు ఎంఎస్ స్వామినాథన్ సిఫారసుల మేరకు సి2+50 ప్లస్ ప్రకారము ఎంఎస్ పి. నీ ప్రకటించాలని,  రైతాంగం ఉద్యమిస్తున్న కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరలు చేయకుండా మన రైతులు పండించిన పంటలను ఎగుమతి చేస్తే ఆ దేశంలో పన్ను కట్టాలి, ఇతర దేశంలో పండించిన పంటలను మన దేశంలో 25% ఉన్న టారిఫ్ ను మన దేశ నాయకులు పూర్తిగా ఎత్తి వేశారు. కనుక ఎగుమతులు దిగుమతులకు అనుమతులు ఇవ్వకుండా అన్ని పంటలకు స్వామినాథ సిఫారసులను అమలు చేయాలని ఎగుమతులు దిగుమతులను ఆపివేయాలని, దేశవ్యాప్తంగా రైతాంగానికి ఉన్న అన్ని అప్పులను మాఫీ చేయాలని ఎస్కేయం డిమాండ్ చేస్తున్నదని తెలిపారు. అలాగే జూలై 25వ తేదీన ఇరు దేశాలు సంతకాలు చేయాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో దీనికి వ్యతిరేకంగా జూలై 22వ తేదీన జోగులాంబ గద్వాల జిల్లా ఎస్ కే ఎం.నిరసనలలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతాంగ సమితి జోగులాంబ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్య రెడ్డి పి వై ఎల్ జిల్లా నాయకులు దానయ్య, ఐ ఎఫ్ టి యు ఆంజనేయులు పౌల్ రాజు,అంజి ప్రదీప్ జమ్మిచేడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య
లింగాల గణపురం (జనగామ):  కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం  తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
రూ.35లక్షల అవినీతిపై విచారణ చేయండి
గద్దె రాగడి ఇంట్లో దొంగతనం
శ్రీ కనక దుర్గమ్మ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఆర్టీసీ బస్సు కండక్టర్ నిజాయితీ..!
ప్రమాదవశాత్తూ ఆటోపై నుండి పడి బాలుడు మృతి