చినుకు పడితే చిత్తడే

హైతాబాద్ చౌరస్తాలో ప్రయాణికులకు ఇబ్బందులు

చినుకు పడితే చిత్తడే

షాబాద్ (రంగా రెడ్డి): షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్ గ్రామ చౌరస్తాలో స్వల్ప వర్షం పడినా రహదారి మొత్తం బురదమయంగా మారుతోంది. దీంతో స్థానికులు, వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చౌరస్తాలో వర్షపు నీరు నిల్వ ఉండటంతో రహదారి చిత్తడిగా మారి ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం నెలకొంది.పాదచారులు కూడా బురదలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చౌరస్తాలో నీరు నిల్వ కాకుండా శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, రహదారిని మరమ్మతు చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
 
 
Views: 101

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య
లింగాల గణపురం (జనగామ):  కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం  తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
రూ.35లక్షల అవినీతిపై విచారణ చేయండి
గద్దె రాగడి ఇంట్లో దొంగతనం
శ్రీ కనక దుర్గమ్మ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఆర్టీసీ బస్సు కండక్టర్ నిజాయితీ..!
ప్రమాదవశాత్తూ ఆటోపై నుండి పడి బాలుడు మృతి