రోడ్డు ప్రమాదాల నివారణకు ముళ్ళ పొదలు తొలగింపు....

నిజాంసాగర్ : ఎల్లారెడ్డి నుంచి పిట్లం వైపు వెళ్లే ప్రధాన రహదారిలో వడ్డేపల్లి గ్రామ శివారులోని సైలాని బాబా దర్గా సమీపంలోని మూల మలుపుల వద్ద తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు Arise – Alive కార్యక్రమంలో భాగంగా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివకుమార్ మాట్లాడుతూ, రహదారికి అడ్డుగా ఉన్న చెట్లు, పొదలను JCB సహాయంతో తొలగించినట్లు తెలిపారు. ప్రమాదాలకు కారణమవుతున్న అడ్డంకులను తొలగించడం ద్వారా ప్రయాణికుల భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొని రహదారి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


