ఎల్లమ్మ చెరువు అభివృద్ధికి రూ.3 కోట్ల అదనపు బడ్జెట్ మంజూరు
పురపాలక సంఘ కమిషనర్ టి మల్లికార్జున్ గౌడ్
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎల్లమ్మ చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనుల కోసం అదనంగా రూ.3 కోట్ల బడ్జెట్ మంజూరు అయిందని పురపాలక సంఘ కమిషనర్ టి మల్లికార్జున్ గౌడ్ తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇప్పటికే 18 కోట్ల నిధులతో ఎల్లమ్మ సుందరీకరణ పనులు, గ్లాస్ బ్రిడ్జి పనులు జరుగు తున్నాయని తుది దశకు చేరుకున్నాయని అన్నారు. ఈ అదనపు నిధులతో ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీ కరణ పనులు పూర్తికానున్నాయని,త్వరలోనే ఎల్లమ్మ చెరువుమరియు గ్లాస్ బ్రిడ్జ్ పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కమిషనర్ తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


