మిస్సింగ్ కేసును ఛేదించిన మర్రిగూడ పోలీసులు!
మర్రిగూడ, : ఓ వ్యక్తి అదృశ్యం అయిన కేసును మర్రిగూడ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు.రెండు నెలలుగా కనిపించకుండా పోయిన వ్యక్తి ఆచూకీని విజయవంతంగా కనుగొని, అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు వివరాల్లోకి వెళ్తే సరికొండ గ్రామం కడ్తాల్ మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన పడకంటి మహేష్ (38) అనే వ్యక్తి తన భార్య శివలీలతో కలిసి వట్టిపల్లిలోని తన అత్తగారింటికి వచ్చారు.అయితే, కుటుంబంలోని ఆర్థిక సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన మహేష్, మే 12న ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయటకు వెళ్లిపోయారు. ఎంతకీ ఆయన తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన భార్య శివలీల మర్రిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.సాంకేతిక ఆధారాలు, అందిన సమాచారాన్ని నిరంతరం విశ్లేషిస్తూ విస్తృతంగా అన్వేషణ కొనసాగించారు. ఈ క్రమంలో శుక్రవారం మహేష్ ఆచూకీని పోలీసులు విజయవంతంగా గుర్తించారు. అనంతరం ఆయనకు తగిన కౌన్సిలింగ్ ఇచ్చి, భార్యాపిల్లల వద్దకు చేర్చారు. దీంతో మహేష్ కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల సహకారం ముఖ్యం:ఎస్ఐ రాంబాబు
పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, లేదా ఎవరైనా కనిపించకుండా పోయినట్లు గుర్తిస్తే వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని,ఇటువంటి క్లిష్ట సమయాల్లో ప్రజల సహకారం పోలీసుల అన్వేషణకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.మహేష్ ఆచూకీ గుర్తించడంలో సహకరించిన స్థానిక ప్రజలకు, సమాచారం అందించిన వారికి, అలాగే ఈ వార్తను విస్తృతంగా ప్రచారం చేసి అన్వేషణలో తోడ్పడిన మీడియా ప్రతినిధులకు ఈ సందర్భంగా ఎస్ఐ రాంబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Views: 51
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
19 Jul 2026 00:48:51
ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగుపడిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంతో, ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే సంఖ్య కూడా పెరుగుతోందని మంత్రి...
