గొర్రెలు, మేకలకు పీపీఆర్ నిరోధక టీకాలు
చౌటకూర్ : చౌటకూర్ మండల పరిధిలోని చక్రియాల, శివంపేట గ్రామాల్లో సోమవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు పీపీఆర్ (పెస్ట్ డెస్ పెటిట్స్ రూమినెంట్స్) వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 400 గొర్రెలు, 20 మేకలకు పీపీఆర్ టీకాలు వేశారు.ప్రాథమిక పశువైద్యాధికారి డా. విశాల్ కుమార్ మాట్లాడుతూ, పీపీఆర్ వ్యాధి నుంచి గొర్రెలు, మేకలను రక్షించేందుకు ప్రతి పశువుకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని రైతులకు సూచించారు. వ్యాధుల నివారణలో టీకాలు అత్యంత కీలకమని, పశుపోషకులు పశువైద్య శాఖ నిర్వహించే టీకాల కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లైవ్‌స్టాక్ అసిస్టెంట్ ప్రభాకర్, కార్యాలయ సబార్డినేట్ సంగయ్యతో పాటు గ్రామాల రైతులు, పశుపోషకులు పాల్గొన్నారు.
Views: 52
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 12:25:58
లింగాల గణపురం (జనగామ): కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
