రామవరం సింగరేణి డిస్పెన్సరీ పునఃప్రారంభం

రామవరం సింగరేణి డిస్పెన్సరీ పునఃప్రారంభం

కొత్తగూడెం : గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) చేపట్టిన నిరంతర పోరాటం ఫలితంగా రామవరం సింగరేణి డిస్పెన్సరీని యాజమాన్యం సోమవారం ఉదయం పునఃప్రారంభించింది.ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎఐటియుసి కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ మాట్లాడుతూ, రామవరం డిస్పెన్సరీని యథావిధిగా కొనసాగించడంతో పాటు పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని నియమించాలని కోరుతూ ఈ ఏడాది మే 31న ప్రధాన ఆసుపత్రి ముఖ్య వైద్యాధికారి (సీఎంఓ) డా. కిరణ్ రాజ్, ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజుకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఎఐటియుసి చేసిన నిరంతర కృషి, యాజమాన్యంపై తీసుకొచ్చిన ఒత్తిడి ఫలితంగానే డిస్పెన్సరీ తిరిగి ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక నర్సు, ఒక వార్డ్ బాయ్‌ను నియమించి, బీపీ, షుగర్ పరీక్షలతో పాటు సాధారణ మందులు అందుబాటులో ఉంచి వైద్య సేవలు ప్రారంభించి నట్లు తెలిపారు. రామవరం ప్రాంతంలోని సింగరేణి కార్మికులు, మాజీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, కాంట్రాక్టు కార్మికులకు ఈ డిస్పెన్సరీ ఎంతో అవసరమైన వైద్య సేవలను అందిస్తోందన్నారు. అయితే డిస్పెన్సరీ పునఃప్రారంభంతో సమస్య పూర్తిగా పరిష్కారమైనట్లు కాదని, వెంటనే శాశ్వత వైద్యుడిని నియమించి, అవసరమైన వైద్య సిబ్బందిని పూర్తిస్థాయిలో భర్తీ చేయడంతో పాటు తగిన మందుల నిల్వలు అందుబాటులో ఉంచి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఎఐటియుసి నాయకులు డిమాండ్ చేశారు.దీనిపై స్పందించిన డైరెక్టర్ (పర్సనల్) కే. వెంకటేశ్వర్లు త్వరలోనే వైద్యుడితో పాటు అవసరమైన సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు. అలాగే డిస్పెన్సరీ నిర్వహణ కోసం ప్రత్యామ్నాయ భవనాన్ని ఏర్పాటు చేసి పునఃప్రారంభానికి సహకరించిన ఏరియా జనరల్ మేనేజర్, ప్రధాన ఆసుపత్రి సీఎంఓలకు ఎఐటియుసి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ రావు, సహాయ కార్యదర్శి గట్టయ్య, ఉపాధ్యక్షుడు కత్తెర్ల రాములు, నాయకులు హుమాయూన్, మండల రాజేశ్వరరావు, మల్లికార్జున్, అప్పారావు, సీపీఐ నాయకులు కంచర్ల జములయ్య, కార్పొరేటర్ శంకర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 
Views: 392

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య
లింగాల గణపురం (జనగామ):  కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం  తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
రూ.35లక్షల అవినీతిపై విచారణ చేయండి
గద్దె రాగడి ఇంట్లో దొంగతనం
శ్రీ కనక దుర్గమ్మ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఆర్టీసీ బస్సు కండక్టర్ నిజాయితీ..!
ప్రమాదవశాత్తూ ఆటోపై నుండి పడి బాలుడు మృతి