భగవంతుడిని నిస్వార్థంగా ప్రార్థించాలి

భగవంతుడిని నిస్వార్థంగా ప్రార్థించాలి

స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : భగవంతుడిని ప్రార్థిస్తూ స్వార్థం లేకుండా లోక కళ్యాణాన్ని కోరుకుంటే ఆ భగవానుడు తప్పకుండా స్పందిస్తాడని శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ రామచంద్ర చిన్న జీయర్ స్వామి అన్నారు. శనివారం జనగామ జిల్లా, చిల్పూరు మండల కేంద్రంలోని శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి కళ్యాణం వేదమంత్రోచ్చరణలతో అర్చకులు వైభవంగా నిర్వహించారు. కల్యాణ మహోత్సవానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ రామచంద్ర చిన్న జీయర్ స్వామికి దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు కిరణ్మయి దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. చిన్న జీయర్ స్వామి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమూల్యమైన ప్రవచన సందేశాన్ని వినిపించారు. అనంతరం హైదరాబాద్ వాస్తవ్యులు సోమ రాజసధారామం మీణ సహకారంతో అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈకార్యక్రమంలో దేవస్థాన ఈవో బి లక్ష్మీ ప్రసన్న, ధర్మకర్త మండలి సభ్యులు డాక్టర్ వేముల వెంకటేశ్వర్లు, భూక్య శ్రీను, గణగోని రమేష్, దారం రాజన్ బాబు, గోళి రాజశేఖర్, రత్నాకర్ రెడ్డి, గొల్లపల్లి వాసు, రాజేందర్ రెడ్డి, ప్రధాన అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ అర్చకులు సౌమిత్రి శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు, ఆలయ సిబ్బంది,  పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Views: 146

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగు-ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగు-ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగుపడిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంతో, ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే సంఖ్య కూడా పెరుగుతోందని మంత్రి...
ఆహార, ఔషధాల్లో కల్తీల నిరోధానికి కఠిన చట్టం-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నాణ్యమైన విద్య, క్రమశిక్షణకు చిరునామా కేజీబీవీ 
శుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
దౌల్తాబాద్ తాండాలో డెంగ్యూపై అప్రమత్తత చర్యలు
కొనాయిపల్లిలో ఘనంగా అక్షరాభ్యాసం కార్యక్రమం
19న జిల్లాస్థాయి తైక్వాండో ఛాంపియన్ సిప్ పోటీలు