దశాబ్దాల కల సాకారం.. కోనంపేట రోడ్డుకు మార్గం

ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామికి ఘన సన్మానం

దశాబ్దాల కల సాకారం.. కోనంపేట రోడ్డుకు మార్గం

 

 

బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా:  దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న నెన్నెల మండలం కోనంపేట–కుష్ణపల్లి–చామనపల్లి రహదారి సమస్యకు పరిష్కారం లభించడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రహదారి నిర్మాణానికి అవసరమైన ఫారెస్ట్ అనుమతులు తీసుకురావడంతో పాటు మంజూరుకు ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామిని గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు బొమ్మెన హరీష్ గౌడ్, కోనంపేట గ్రామ సర్పంచ్ జింజిరి సీతారాం తదితరులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.రోడ్డు సౌకర్యం లేక ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మూడు గ్రామాల ప్రజలకు రహదారి నిర్మాణంతో రాకపోకలుమెరుగుపడనున్నాయని వారు పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయాణం, రైతుల రాకపోకలు, అత్యవసర సేవలకు ఈ రహదారి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.అనంతరం ఘనపూర్ సర్పంచ్ గన్న సతీష్, నందులపల్లి సర్పంచ్ కామెర వనిత శంకర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు గోగు సురేందర్, నారా మల్లేశ్, బండి సాయి కుమార్ గౌడ్, మెండే తిరుపతి, పవన్, రాకేష్ తదితరులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

78 ఏళ్ల కలకు పరిష్కారం

కోనంపేట రహదారి కోసం 78 ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని గ్రామస్థులు పేర్కొన్నారు. రహదారి నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, మంజూరు ప్రక్రియ ముందుకు సాగడం తమకు ఎంతో ఉపశమనాన్ని కలిగించిందన్నారు.

Views: 85

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News