చక్రియాల్‌లో హరితహారం వన మహోత్సవం ఘనంగా నిర్వహణ
చౌటకూర్ మండలం చక్రియాల్ గ్రామ పంచాయతీ పరిధిలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం సమీపంలో మంగళవారం హరితహారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కే. శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని పరిరక్షించడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ నాటిన మొక్కలను సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనసూయ రాజశేఖర్, ఎంపీఓ సువర్ణ, పంచాయతీ కార్యదర్శి నర్సింలు, ఫీల్డ్ అసిస్టెంట్ గంగారం, ఉప సర్పంచ్ నార్సింగి మొగులయ్య, వార్డు సభ్యులు తుంగె శ్రీశైలం, శ్రీనివాస్, మన్నె మొగులయ్య, మాజీ ఎంపీటీసీ పండరి, సత్యనారాయణ, విష్ణువర్ధన్‌తో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
04 Aug 2026 18:44:58
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
