ఎస్సి సబ్ ప్లాన్ పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం ఎందుకు?

ఎస్సి సబ్ ప్లాన్ పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం ఎందుకు?

  • - సబ్ ప్లాన్ నిధులతో మంజురైన పనులను వెంటనే పూర్తి చేయాలి
  • - జిల్లా ప్రజావాణి లో సర్పంచ్ ల వినతి
 

గజ్వేల్/సిద్దిపేట :జగదేవపూర్ మండలం లో పలు గ్రామాల్లో ఎస్సి కాలనీలలో సబ్ ప్లాన్ నిధుల కింద మంజురైనా పనులను వెంటనే పూర్తి చేయాలనీ జిల్లా ప్రజావాణి లో తిమ్మాపూర్ సర్పంచ్ పోసాన్ పల్లి రాజు మరియు, తిగుల్ సర్పంచ్ రజిత పరుశురాం, పీర్ల పల్లి సర్పంచ్ ఓంప్రకాష్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం దళితుల అభివృద్ధి కాలనీ అభివృద్ధి కోసం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ న్ చట్టం తీసుకువచ్చిందని, ప్రతి శాఖ ద్వారా 25శాతం ఎస్సీ ఎస్టీలకు ఖర్చు చేయాలి కానీ పేరుకే చట్టం ఉంది కానీ నిధులను పక్కదారి పడుతుందన్నారు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఇతర కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారన్నారు. గ్రామాలలో కేటాయించిన సబ్ ప్లాన్ పనులను ఎందుకు పూర్తిస్థాయిలో పనులు చేయలేకపోతున్నారన్నారు. కాంట్రాక్టర్లు సబ్ ప్లాన్ పనులు చేస్తే డబ్బులు రావడంలేదని అని చెప్పుతున్నారన్నారు. ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి సబ్ ప్లాన్ చట్టం పైన చిత్తశుద్ధితో పనిచేయలి అని తెలిపారు. ఇప్పటికే తిమ్మాపూర్, పీర్లపల్లి తిగుల్ గ్రామాలలో కేటాయించిన పనులను కాంట్రాక్టర్ తో మాట్లాడి వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దళితులతో ఉద్యమం చేపట్టాల్సిన వస్తుందని హెచ్చరించారు.
 
 
Views: 21

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
మూడు నెలల రేషన్ కోటాను సజావుగా పంపిణీ చేయాలి
తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం.
నాన్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
చక్రియాల్‌లో హరితహారం వన మహోత్సవం ఘనంగా నిర్వహణ
తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్  శ్రీశైల్ రెడ్డి .
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.