వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.
- టిఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కంచర్ల శివా రెడ్డి.
- తాండూరు లొ ఘనంగా టిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం.
తాండూరు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కంచర్ల శివా రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ కోలా శ్రీనివాస్, జుక్కల్ ఇంచార్జ్ రాజశేఖర్, తాండూరు నియోజకవర్గ ఇన్చార్జ్ వీరమణి లు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న టిఆర్ఎస్ జండా పండుగ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి జెండా ఆవిష్కరించారు. అంతకుముందు ఇందిరా చౌక్ లోని బసవేశ్వర, జయశంకర్ విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గం లో మొదటి జెండాను ఎగరవేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో గ్రామ గ్రామాన గల్లి గల్లి లో జెండా ఎగురవేసి టిఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.రానున్న రోజుల్లో టిఆర్ఎస్ నియోజకవర్గ వ్యాప్తంగా బలమైన కార్యకర్తలను తయారు చేసుకోబోతుందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈనెల 6న హైదరాబాదులో సామాజిక తెలంగాణ న్యాయ సభను నిర్వహించ నున్నామన్నారు. పదివేల మందితో ఈ సభ జరగబోతుందన్నారు. తాండూరు నియోజకవర్గం అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వచ్చే దిశగా కవితక్క చేస్తున్న కార్యక్రమం చాలా గొప్పది అన్నారు. రైల్ రోకో కార్యక్రమాన్ని నిర్వహించి విజయం సాధించిన ఘనత కవితక్కదన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దీపక్ రెడ్డి, శ్రీనివాస్, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
Views: 9
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
04 Aug 2026 18:44:58
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
