పోతరాజులు,అమ్మవారి వేషధారణలో పాల్గొన్న విద్యార్థులు.

పోతరాజులు,అమ్మవారి వేషధారణలో పాల్గొన్న విద్యార్థులు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో బోనాల సంబురాలు

రాయికల్ (జగిత్యాల): ఆషాఢ మాసం సందర్భంగా రాయికల్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థులు నిర్వహించిన బోనాల ర్యాలీ పట్టణ ప్రజలను ఆకట్టుకుంది.ఈ సందర్భంగా విద్యార్థులు పోతరాజుల వేషధారణలో,బాలికలు అమ్మవారి రూపంలో అలంకరించుకుని బోనాలు ఎత్తుకుని పట్టణ వీధుల్లో భక్తిశ్రద్ధలతో ర్యాలీ నిర్వహించారు.పలు కూడళ్లలో సంప్రదాయ నృత్యాలతో సందడి చేస్తూ బోనాల పండుగ విశిష్టతను చాటిచెప్పారు. అనంతరం స్థానిక పెద్ద పోచమ్మ ఆలయానికి చేరుకుని బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులకు తెలంగాణ పండుగల ఆచారాలు, సంస్కృతి పరిరక్షణ ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జూపల్లి తిరుపతిరావు, ప్రిన్సిపల్ జూపల్లి వేణుగోపాల్‌రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బోనాల వేడుకలు భక్తి,సంప్రదాయాల సమ్మేళనంగా నిలిచాయి.
 
1001495089
 
 
Views: 59

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News