డాక్టరేట్ అందుకున్న డాక్టర్ ఎడవల్లి కృష్ణ
కొత్తగూడెం : ప్రముఖ విద్యావేత్త, సామాజిక సేవకుడు, మదర్ థెరిసా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (పెద్దపల్లి) వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఎడవల్లి కృష్ణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లో నిర్వహించిన ఇండో ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ కాన్క్లేవ్ కాన్వొకేషన్ కార్యక్రమంలో అమెరికాలోని మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ తరఫున పి హెచ్. డి గౌరవ డాక్టరేట్‌ను యూనివర్సిటీ ప్రతినిధులు అందజేశారు.మదర్ థెరిసా విద్యాసంస్థల ద్వారా విద్యారంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలు, సమాజాభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పాల్వంచకు చెందిన ఎడవల్లి కృష్ణ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. ఎంజేఎఫ్ లయన్ గా సేవలందిస్తున్న ఆయనకు లయనిజంలోనూ విశేష గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా యూకేఎఫ్ ప్రతినిధులు, అభిమానులు, విద్యావేత్తలు, శ్రేయోభిలాషులు డాక్టర్ ఎడవల్లి కృష్ణకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Views: 14
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 12:25:58
లింగాల గణపురం (జనగామ): కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
