రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి ₹ 1 కోటి బీమా చెక్కు
On
రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి ₹ 1 కోటి బీమా చెక్కు.. అందజేసిన డీజీపీ సివి ఆనంద్
విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై అనంతరం మృతిచెందిన రాచకొండ కమిషనరేట్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వి. చరణ్‌కుమార్ (పీసీ-8968) కుటుంబ సభ్యులకు డీజీపీ సి.వి. ఆనంద్ రూ.1 కోటి బీమా చెక్కును అందజేశారు.
మల్కాజిగిరి కమిషనరేట్ 2018 బ్యాచ్‌కు చెందిన చరణ్‌కుమార్ ఈగల్ ఫోర్స్‌లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. 2025 సెప్టెంబర్ 22-23 తేదీల అర్ధ రాత్రి విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా మహారాష్ట్రలోని దేవార్కర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కుడికాలు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. మొదట స్థానికంగా ప్రథమ చికిత్స అందించిన అనంతరం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యుల సూచనల మేరకు ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించగా, చికిత్స అనంతరం 2025 అక్టోబర్ 28న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే అకస్మాత్తుగా కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు మళ్లీ యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన మృతిచెందినట్లు ప్రకటించారు.
కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ షాండిల్య, ఎస్పీ రఘువీర్, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి తదితర అధికారులు ఎస్‌బీఐతో సమన్వయం చేసి బీమా క్లెయిమ్‌ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా డీజీపీ సి.వి. ఆనంద్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Views: 7
About The Author

Tags:

Error on ReusableComponentWidget
Latest News
04 Aug 2026 18:44:58
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
