కాంగ్రెస్ భీమా రెన్యువల్ చేయాలి...

బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలి.

కాంగ్రెస్ భీమా రెన్యువల్ చేయాలి...

మండల కాంగ్రెస్ నాయకత్వానికి మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు నాటు రాయి వెంకటరావు వినతి.

ఖమ్మం : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 45 లక్షల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా అమలు చేసిన సభ్యత్వ భీమా పథకాన్ని వెంటనే రెన్యువల్ చేసి, ఇప్పటివరకు పరిహారం అందని బాధిత కుటుంబాలకు భీమా సొమ్ము చెల్లించేలా చర్యలు తీసుకోవాలని నరసింహపురం మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు నాటు రాయి వెంకటరావు మండల కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన వినతిపత్రంలో, పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సభ్యత్వ భీమా ప్రీమియంను పార్టీ తరఫున చెల్లించిందని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భీమా పథకాన్ని రెన్యువల్ చేయకపోవడంతో ఇటీవల ప్రమాదాలు, మరణాలకు గురైన కార్యకర్తల కుటుంబాలకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా భీమా పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం కోసం బాధిత కుటుంబాలు పార్టీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి బాధాకరమని, కష్టకాలంలో కార్యకర్తలకు అండగా నిలవాల్సిన పార్టీ ఈ విషయంలో స్పందించాలని కోరారు. గ్రామస్థాయిలో కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు. మండల నాయకత్వం ద్వారా రాష్ట్ర నాయకత్వానికి వెంటనే సభ్యత్వ భీమా పథకాన్ని రెన్యువల్ చేయాలని, పరిహారం అందని బాధిత కుటుంబాల జాబితా రూపొందించి వారికి భీమా సొమ్ము చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ప్రతి ఏడాది భీమా రెన్యువల్ జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్యకర్తలే పార్టీకి బలమని, వారి కుటుంబాలకు భరోసా కల్పించే దిశగా జిల్లా నాయకత్వం, రాష్ట్ర పీసీసీ తక్షణ చర్యలు తీసుకోవాలని నాటు రాయి వెంకటరావు కోరారు.
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
మూడు నెలల రేషన్ కోటాను సజావుగా పంపిణీ చేయాలి
తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం.
నాన్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
చక్రియాల్‌లో హరితహారం వన మహోత్సవం ఘనంగా నిర్వహణ
తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్  శ్రీశైల్ రెడ్డి .
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.