ఆదిలాబాద్ పట్టణంలో గణపతి నిమర్జనోత్సవానికి పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు.

ఆదిలాబాద్ పట్టణంలో గణపతి నిమర్జనోత్సవానికి పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు.

  • బందోబస్తులో పాల్గొననున్న 600 మంది పోలీసు సిబ్బంది.
  • 600 సీసీటీవీ కెమెరాలతో, డ్రోన్ కెమెరాతో నిఘా.
  • 13 సెక్టర్లు,13 క్లస్టర్లు, 23 - పికెట్స్, రూఫ్ టాప్ బందోబస్తు, హైవే పెట్రోలింగ్ ప్రత్యేకం.
  • ఇద్దరు సీఐలు 15 మంది బృందంతో 2 స్ట్రైకింగ్ ఫోర్స్ లు
  • రెండు బృందాలుగా సివిల్ డ్రెస్ నందు పోలీసు సిబ్బంది.
  • ప్రజలకు అందుబాటులో పట్టణంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.
  • రెండు నిమజ్జన ప్రదేశాలలో బందోబస్తు ఏర్పాటు.*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్ :  ఆదిలాబాద్ పట్టణం గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుని నిమర్జన కార్యక్రమానికి సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తతో ఉంటూ పటిష్ట బందోబస్తు చర్యలను చేపట్టిందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ముఖ్యంగా పట్టణంలో 600 మంది పోలీసు సిబ్బందితో నిమర్జనోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా 600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటలు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. పట్టణంలో 13 క్లస్టర్లు సిఐ స్థాయి అధికారి చే, 13 సెక్టార్లు ఎస్సై స్థాయి అధికారిచే గా విభజించిన సిబ్బందిని అడుగడుగునా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో గణపతి ఉత్సవాలను పూర్తి చేసుకొని నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. పట్టణంలో ముఖ్యమైన ప్రదేశాల నందు సమస్యత్మక ప్రాంతాల నందు 23  పికెట్స్ ను ఏర్పాటు చేసి శాశ్వతంగా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా సిఐ స్థాయి అధికారిని ఏర్పాటు చేసి రెండు స్ట్రైకింగ్ ఫోర్సులను ఏర్పాటు చేసి 15 మంది పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క దారిలో సెక్టర్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షిస్తారన్నారు. ప్రధానమైన రోడ్ల నందు రూఫ్ టాప్ బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. పట్టణంలో 15 మంది కెమెరా సిబ్బంది ని ఏర్పాటు చేసి సమస్యల సృష్టించే వారిని వీడియోగ్రఫీ ద్వారా గుర్తించడం జరుగుతుందన్నారు, డ్రోన్ కెమెరాతో పట్టణంలోని పరిస్థితిని పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ప్రత్యేకంగా రెండు బృందాల సిబ్బందిని మఫ్టీ లో ఉంచి ఆకతాయిల మరియు ప్రజలను రెచ్చగొట్టే వారి పై, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకోవడానికి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా 20 మంది స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది పట్టణంలో విధులను నిర్వర్తిస్తుండన్నారు. ప్రజలు తెలియజేసినటువంటి సూచనలు పాటించాలని తెలిపారు. నిమర్జనం ఉత్సవాలలో డీజే లకు అనుమతి లేదని, కనులకు హాని చేసే లేజర్ లైట్లకు, పేపర్ సెల్ లో యంత్రాలకు అనుమతులు లేవని తెలిపారు. ఓపిక తో ఉంటూ ప్రజలతో ప్రశాంతంగా వ్యవహరిస్తూ ముందుకు సాగించాలని సూచించారు. పట్టణంలో 15 మంది సీఐలు,ఇద్దరు డిఎస్పీలు, ఒక ఏఎస్పి, ఇద్దరు అడిషనల్ ఎస్పీ లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  పర్యవేక్షిస్తూ బందోబస్తు కొనసాగించడం జరుగుతుందన్నారు. చివరి గణపతి నిమర్జనం పూర్తి అయ్యేంతవరకు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తతోనే వ్యవహరిస్తుందని శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా సిబ్బందికి సూచనలు చేయడం జరిగిందని తెలిపారు. పట్టణంలో ప్రజలకు సమాచారం తెలిపేందుకు కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి సమాచారం అందించబడుతుందన్నారు. అదేవిధంగా రెండు నిమర్జనం ప్రదేశాలు పెన్గంగా మరియు చాంద టి నందు మహిళా సిబ్బందితో కలిపి బందోబస్తు ఏర్పాటు చేసి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షిం చమని సూచించారు. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు వేల గణపతి విగ్రహాలను ప్రదర్శించినట్లు   ఇప్పటివరకు దాదాపు జిల్లా వ్యాప్తంగా పదిహేను వందల గణపతుల నిమర్జనాలు విజయవంతంగా పూర్తి చేసుకుని, రేపటి కి 250 గణపతి విగ్రహాల నిమర్జనం ఉందన్నారు. నిమర్జనం ఉత్సవాలలో పాల్గొనే ప్రజలు వారి పిల్లలను తమ వద్దని జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. నిమర్జనానికి చిన్న పిల్లలను మాత్రమే పంపవద్దని వారితోపాటు పెద్దవారిని సైతం పంవాలని సూచించారు. చెరువులు వాగులు వద్ద జాగ్రత్తలు పాటించాలని ప్రాణనష్టం సంభవించే ఆస్కారం ఉందని తెలిపారు. నిమర్జనం ఉత్సవాలలో కరెంటు వైర్ల పట్ల జాగ్రత్తలు పాటిస్తూ వ్యవహరించాలని సూచించారు.

Views: 94

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి: ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి:
మేడ్చల్ మల్కాజ్గిరి  : ఎన్ఆర్ఐ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్...
అత్యవసర సమయంలో అండగా.. సీఎం సహాయనిధి
బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ఉత్తమ విద్యార్థులకు శ్రీరామ్ గ్రూప్ చేయూత.
వినాయకుని నెలకొల్పడం అభినందనీయం 
గంభీరావుపేటలోముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
యు -19 క్రికెట్ లో జాతీయ స్థాయి కి ఎంపికైన దమ్మన్నపేట ఆదర్శ పాఠశాల పూర్వ విద్యార్థిని