యం. జి. యు లో మద్యం మత్తులో ట్రాక్టర్ నడిపిన ఉద్యోగి?

యం. జి. యు లో మద్యం మత్తులో ట్రాక్టర్ నడిపిన ఉద్యోగి?

• విద్యార్థులను ఢీకొట్టిన ఘటనపై తీవ్ర దుమారం..

హైదరాబాద్ : మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మద్యం మత్తులో ట్రాక్టర్ నడుపుతూ  విద్యార్థి నితిన్ ను ఢీకొనడంతోఅతని కుడికాలు విరిగిందని విద్యార్థుల ఆరోపిస్తున్నారు. గాయపడిన విద్యార్థి వైద్య ఖర్చులన్నీ యూనివర్సిటీ యే భరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.. గతంలోనూ ఇదే ఉద్యోగి మద్యం మత్తులో విధులకు వచ్చినట్లు ఆరోపణలు వున్నాయి. గతంలో సస్పెండ్ అయిన గాని. కుక్క తోక వంకర అన్నట్టే మళ్లీ సంఘటన రిపీట్ అయిందని విద్యార్థులు పేర్కొంటున్నారు.  విద్యార్థులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేస్తారు. ఉద్యోగులకు ఎందుకు చేయరంటూ నిలదీత.! వాహనాలు నడిపే ప్రతి ఉద్యోగికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించాలంటూ డిమాండ్. భద్రతా చర్యల్లో సెక్యూరిటీ ఆఫీసర్ నిర్లక్ష్యంపై కూడా ఆరోపణలు వెళువెత్తుతు న్నాయి .సెక్యూరిటీ ఆఫీసర్‌పై కూడా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి పూర్తిగా కోలుకునే వరకు వైద్య ఖర్చులు యూనివర్సిటీనే భరించాలంటున్న విద్యార్థి సంఘాలు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News