మహిళలకు అండగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌...

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

మహిళలకు అండగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌...

హన్మకొండ :అన్నివర్గాల ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం రేవంత్‌రెడ్డి అన్ని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  అన్నారు.మంగళవారం ఐనవోలు మండలానికి చెందిన కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ 47 మంది ఆడపడుచులకు 47లక్షల 05వేల 452 రూపాయల విలువైన చెక్కులను సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ పేదింటి ఆడుపచులకు వరమన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లల పెళ్లిళ్ల సమయంలో కుటుంబాలపై పడే ఆర్థిక భారం తగ్గించేందుకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాల ప్రయోజనాలను పొందాలని సూచించారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి వద్దకే తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పేద ప్రజలకు అండగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోహన్ గౌడ్,మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు శంకర్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చిరెడ్డి,జేబిఎం జిల్లా చైర్మెన్ రుగ్వేద్ రెడ్డి,జిల్లా సెక్రెటరీ సాంబయ్య,మహేష్ గౌడ్,ఎలిశా,సీనియర్ నాయకులు మధు,రాకేష్ రెడ్డి,రాజు, లక్ష్మణ్ రావు,సర్పంచులు,వార్డు సభ్యులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు. 
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News