అక్షరాస్యత అభివృద్ధికి తొలిమెట్టు

ప్రజల్లో అవగాహన కల్పిస్తూ విద్యార్థుల ర్యాలీ.

అక్షరాస్యత అభివృద్ధికి తొలిమెట్టు

 

 

కారేపల్లి(ఖమ్మం):అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో విద్యార్థులచే ఎంపీడీవో పద్మ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.కేజీబీవీ, జడ్పీహెచ్ఎస్,ఆదర్శ పాఠశాల విద్యార్థులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొని అక్షరాస్యత ప్రాధాన్యతను తెలియజేస్తూ నినాదాలు చేశారు.ప్రజల్లో అక్షరాస్యతపై అవగాహన కల్పించేందుకు విద్య ప్రాముఖ్యతను చాటుతూ అంబేద్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ప్లకార్డులు,బ్యానర్లతో విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.“అక్షరమే ఆయుధం.. విద్యే అభివృద్ధికి మార్గం” అంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు అక్షరాస్యత ఆవశ్యకతను వివరించారు. అనంతరం ఎంపీడీవో పద్మ,విద్యాశాఖ అధికారి జయరాజు మాట్లాడుతూ వ్యక్తులు,సమాజ అభివృద్ధిలో అక్షరాస్యత పోషించే పాత్రను గుర్తించే లక్ష్యంతో ఏటా సెప్టెంబరు 8న 'అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం నిర్వహిస్తారన్నారు.అందరికీ విద్య అనే భావనను పెంపొందించడంతోపాటు ఇది అందరి ప్రాథమిక హక్కు అని చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశమని,ప్రతి ఒక్కరూ చదువు నేర్చుకోవడంతో పాటు,నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.విద్యార్థుల్లో విద్యపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు అక్షరాస్యత ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయాలన్నారు. ర్యాలీల ఎస్‌ఓ ఝాన్సీ సౌజన్య,ఐకెపి సభ్యులు,ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 48

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..? సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..?
నెలలు గడుస్తున్నా.. కో ఆప్షన్ ఊసేది..? పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు..   కౌన్సిల్లో ఖాళీగా కొనసాగుతున్న కో ఆప్షన్ సభ్యుల  స్థానాలు.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ..
బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం
ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలి.: జిల్లా కలెక్టర్ రాజర్షి షా 
ప్రభుత్వ హాస్పిటల్ వద్ద విద్యుత్ సమస్యకు తక్షణ పరిష్కారం - చైర్మన్ తీగల సునేంద్ర కుమార్
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి: జలసాధన జేఏసీ