విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ
హన్మకొండ న్యూస్ : వేలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో వేలేరు గ్రామానికి చెందిన మాడిశెట్టి సంపత్ -సోమలక్ష్మి విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ,బిల్లా యాదగిరి పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు ప్రతి సంవత్సరం దాదాపు 50 వేల రూపాయల విలువ చేసే ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ చేస్తున్న సంపత్ ని అభినందించి, కృతజ్ఞతలు తెలియజేసినారు, ప్రభుత్వ పాఠశాలకు అందిస్తున్న దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, పాఠశాలలో చదువుకునే 218 విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందివ్వడం జరిగింది, అదేవిధంగా విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయి ఎదగాలని, బాగా చదువుకునే విద్యార్థులకు మరియు క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తామని సర్పంచ్ తెలియజేసినారు. అనంతరం నోటు పుస్తకాల దాత సంపత్ ని సన్మానించరు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్ , ప్రధానోపాధ్యాయులు సత్యం , రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు రాజన్న, ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Jul 2026 20:44:32
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా....
