వరంగల్‌ జిల్లాలో డిజిటల్‌ మౌలిక వసతుల విస్తరణ పై పార్లమెంట్ లో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

వరంగల్‌ జిల్లాలో డిజిటల్‌ మౌలిక వసతుల విస్తరణ పై పార్లమెంట్ లో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

హన్మకొండ న్యూస్ : వరంగల్‌ జిల్లాలో గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు 4జీ, 5జీ మొబైల్‌ సేవల విస్తరణ, నెట్‌వర్క్‌ బ్లాక్‌స్పాట్ల తొలగింపు, కొత్త మొబైల్‌ టవర్ల ఏర్పాటు తదితర అంశాలపై వరంగల్‌ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత మూడేళ్లలో జిల్లాలో మొబైల్‌ కనెక్టివిటీ విస్తరణ స్థితి, కేంద్ర ప్రభుత్వ పథకాల కింద మంజూరై ఏర్పాటు చేసిన టవర్ల వివరాలు, నెట్‌వర్క్‌ సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై వివరణ కోరారు. వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్‌ బుధవారం సమాధానమిచ్చారు. జూన్‌ 2026 నాటికి వరంగల్‌ జిల్లాలో రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా లెక్కల ప్రకారం 218 గ్రామాలు ఉన్నాయని తెలిపారు. వీటిలో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీ, 216 గ్రామాలకు 4జీ సేవలు అందుతున్నాయని వెల్లడించారు. 47 గ్రామాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ, వరంగల్‌ జిల్లాలో డిజిటల్‌ కనెక్టివిటీ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఎంపీ డా. కడియం కావ్య అన్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఒక్క గ్రామం కూడా నెట్‌వర్క్‌ సౌకర్యానికి దూరంగా ఉండకూడదని, 4జీతోపాటు 5జీ సేవలను కూడా విస్తరించాలని వరంగల్ ఎంపీ కోరారు. విద్య, వైద్యం, ఉపాధి, ప్రభుత్వ సేవలు, డిజిటల్‌ లావాదేవీలకు నాణ్యమైన మొబైల్‌, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ అత్యవసరమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న నిధులను సద్వినియోగం చేసుకుని వరంగల్‌లో మిగిలిన నెట్‌వర్క్‌ లోటుపాట్లను కూడా వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలకు మెరుగైన డిజిటల్‌ మౌలిక వసతులు కల్పించడమే నా లక్ష్యం అని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య అన్నారు.
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్ మండలంలో అభివృద్ధి పనులపై అదనపు ప్రోగ్రాం ఆఫీసర్ మధులత  చౌటకూర్ మండలంలో అభివృద్ధి పనులపై అదనపు ప్రోగ్రాం ఆఫీసర్ మధులత 
చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం కేంద్రంలో మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం రోజున వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా...
జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
వరంగల్‌ జిల్లాలో డిజిటల్‌ మౌలిక వసతుల విస్తరణ పై పార్లమెంట్ లో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య
సీఎం సభకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
ఇందిరా మహిళా శక్తి చీరలు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక: ఎమ్మెల్యే కేఆర్  నాగరాజు
బోర్లం గురుకులాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు  శ్రీకారం