ఉట్నూర్ మండల స్థాయి సమీక్ష సమావేశం
ప్రజా ప్రతినిధులు, అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్ : ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, అధికారులు, ప్రజా ప్రతినిధులు. గ్రామాల్లోని సమస్యలు సర్పంచ్ లను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల నుండి హాజరైన అధికారులను, శాఖల వారీగా సమస్యలను తెలుసుకున్నారు. నర్సాపూర్ జె, వంకతుమ్మ, ఉట్నూర్, శ్యాంపూర్, చెరువుగూడ గ్రామాల్లో వర్ష కాలంలో ఏర్పడే విద్యుత్, రోడ్లు, వ్యవసాయం, వైద్యం, మంచి నీరు తదితర అంశాల పైన సుదీర్ఘంగా సమీక్ష జరపి గ్రామాల్లో 100% జల సిరి ద్వారా ఇంకుడు గుంతలు నిర్మిస్తే ఎమ్మెల్యే నిధుల నుండి గ్రామ అబివృద్దికి 5 లక్షల అదనంగా మంజూరు చేస్తాం అన్నారు. అధికారులు ఎప్పటికీ అప్పుడు సర్పంచ్ల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలి అన్నారు. అంగన్వాడీ నియామకాల్లో రూల్ పోసిషన్ పాటించాలని ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. ఉట్నూర్ టౌన్ రోడ్డు విస్తరణ, హ్యామ్ ద్వారా రోడ్ల విస్తరణ నిర్మాణం చేపడతాం అన్నారు. వర్ష కాలం దృశ్య వీధి దీపాలు, శానిటేషన్ పట్ల ప్రత్యేక చొరవ చూపాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
Views: 56
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
