జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

కొత్తగూడెం  : భారతదేశ గ్రంథాలయ రంగానికి విశిష్ట సేవలందించిన  ఎస్.ఆర్. రంగనాథన్‌ జయంతిని పురస్కరించుకుని జాతీయ గ్రంథపాలకుల దినోత్సవాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  పసుపులేటి వీరబాబు, కార్యదర్శి  కె. కరుణకుమారి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్.ఆర్. రంగనాథన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా చైర్మన్ పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ, గ్రంథాలయాలు సమాజంలో విజ్ఞానం, విద్య, చైతన్యాన్ని పెంపొందించే కీలక కేంద్రాలని అన్నారు. ప్రతి ఒక్కరికీ జ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో గ్రంథాలయాల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. భారతదేశ గ్రంథాలయ ఉద్యమానికి ఎస్.ఆర్. రంగనాథన్‌ పునాదులు వేశారని, దేశంలో గ్రంథాలయ వ్యవస్థ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. గ్రంథాలయాలను విద్యార్థులు, యువత, పాఠకులు సద్వినియోగం చేసుకుని తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ గ్రంథాలయ సేవలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా కేంద్ర గ్రంథాలయం గ్రేడ్‌–II లైబ్రేరియన్ ఎస్. లలితకుమారి, మణిమృదుల, జిల్లా గ్రంథాలయ సంస్థ ఆఫీస్ ఇన్‌చార్జి యం. నవీన్‌కుమార్, జిల్లాలోని గ్రంథపాలకులు,పాఠకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్ మండలంలో అభివృద్ధి పనులపై అదనపు ప్రోగ్రాం ఆఫీసర్ మధులత  చౌటకూర్ మండలంలో అభివృద్ధి పనులపై అదనపు ప్రోగ్రాం ఆఫీసర్ మధులత 
చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం కేంద్రంలో మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం రోజున వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా...
జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
వరంగల్‌ జిల్లాలో డిజిటల్‌ మౌలిక వసతుల విస్తరణ పై పార్లమెంట్ లో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య
సీఎం సభకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
ఇందిరా మహిళా శక్తి చీరలు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక: ఎమ్మెల్యే కేఆర్  నాగరాజు
బోర్లం గురుకులాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు  శ్రీకారం