బొమ్మరెడ్డిగూడెంలో సంత్ శ్రీ రామ్‌రావ్ మహారాజ్ 91వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

బొమ్మరెడ్డిగూడెంలో సంత్ శ్రీ రామ్‌రావ్ మహారాజ్ 91వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

చౌటకూర్ జూలై 29 : సంగారెడ్డి జిల్లా బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం, బాల బ్రహ్మచారి శ్రీ శ్రీ శ్రీ సంత్ తపస్వి రామ్‌రావ్ మహారాజ్ 91వ జయంతి వేడుకలు చౌటకూర్ మండలం బొమ్మరెడ్డిగూడెంలోని భవానీ సేవాభాయ్ (సేవాలాల్) ఆలయ ప్రాంగణంలో బుధవారం నాడు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బంజారా సంప్రదాయబద్ధంగా ‘భోగ్ భండార్’ కార్యక్రమాన్ని నిర్వహించి, స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. ఈ వేడుకల సందర్భంగా గ్రామంలోని భక్తులకు, ప్రజలకు భారీగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
విద్యార్థులకు ఫలాల పంపిణీ:
జయంతి ఉత్సవాల్లో భాగంగా స్థానిక గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు పండ్లు (అరటిపండ్లు) పంపిణీ చేశారు. సంత్ రామ్‌రావ్ మహారాజ్ సమాజానికి చేసిన సేవలు, చూపిన భక్తి మార్గాన్ని ఈ సందర్భంగా పలువురు నాయకులు స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ జైపాల్ నాయక్, ఉప సర్పంచ్ రజిని గోపాల్, ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు, వార్డు సభ్యులు గోపాల్, మేనక గణేష్, నాయకులు శంకర్ నాయక్, రవీందర్ నాయక్, రఘు నాయక్, దేవిదాస్, హెడ్ మాస్టర్, మెదక్ ఎక్సైజ్ డీటీఎఫ్ సీఐ గోపాల్, ఖోలా విట్టల్, బాల్ సింగ్, సురేందర్, రంగారావు, జైల్ సింగ్, పాండు, రమేష్, ఉమ్లా, రెడ్డి, రవీందర్, శ్రీనివాస్, తిలక్, సురేష్, మీట్యా, వసంత్, ప్రకాష్, పాండ్యా, విగ్యా, ప్రవీణ్, అకేష్, అవినాష్‌లతో పాటు గ్రామ పురోహితులు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
 
 
Views: 16

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
14 మందికి క్వార్టర్ల కేటాయింపు 
ఘనంగా భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
‘క్యాతన్ పల్లిలో’ కమిషనర్ విధులకు ఆటంకం 
విద్యార్థుల అభ్యాస లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత