వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు

వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు

గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :  శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్ అగ్రో టెక్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు హవాన్ డ్రోన్ టెక్నాలజీ, హైదరాబాద్ సంస్థల సహకారంతో విశ్వవిద్యాలయం దత్తత గ్రామమైన క్షీరసాగర్ లో రైతులకు వ్యవసాయ డ్రోన్ల వినియోగం పై అవగాహన సదస్సు మరియు ప్రత్యక్ష ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిపుణులు కూరగాయల పంటల్లో డ్రోన్ల ద్వారా ఎరువులు, సూక్ష్మ పోషకాలు, పురుగు మందుల సమర్థవంతమైన పిచికారి విధానం, డ్రోన్ నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, జాగ్రత్తలు, ఆధునిక వ్యవసాయంలో డ్రోన్ సాంకేతికత ప్రాధాన్యాన్ని రైతులకు వివరించారు. అనంతరం డ్రోన్ ద్వారా పంటలపై ప్రత్యక్షంగా పిచికారీ నిర్వహించి రైతులకు ప్రదర్శించారు. దీంతో తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో, సమర్థవంతంగా వ్యవసాయ పనులు నిర్వహించవచ్చని వివరించారు. అనంతరం పీజీఐహెచ్ఎస్ విద్యార్థులు రైతులకు టమాటా గ్రాఫ్టింగ్ పద్ధతిని ప్రత్యక్షంగా ప్రదర్శించి, గ్రాఫ్టింగ్ వల్ల వ్యాధి నిరోధకత పెరగడం, అధిక దిగుబడి సాధించడం, మొక్కలు జీవన కాలం పెరగడం వంటి ప్రయోజనాలను వివరించారు. రైతులు ఆసక్తిగా పాల్గొని పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పీజీఐహెచ్ఎస్ ఆఫీసర్ ఇన్చార్జి డా. డి. విజయ, క్షీరసాగర్ గ్రామ సర్పంచ్ కొన్యాల బాల్ రెడ్డి, కార్యక్రమ కన్వీనర్ డా. వి. సుచిత్ర, సభ్యులు డా. జి. సతీష్, పులి శ్రీనివాస్, బి. చంద్రశేఖర్, పుష్కల్ అగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన అనూక్ బాబు (రీజినల్ సేల్స్ మేనేజర్), హవాన్ డ్రోన్ టెక్నాలజీస్, హైదరాబాద్ కు చెందిన మహేష్ రెడ్డి, పీజీఐహెచ్ఎస్ అధ్యాపకులు, విద్యార్థులు, ప్రగతిశీల రైతులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 
 
Views: 316

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :  శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
సింగరేణిలో హౌసింగ్ పీడీ పర్యటన
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
వర్షానికి రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.
కొండగట్టులో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ అమలుపై రాష్ట్రస్థాయి ఆన్‌లైన్ శిక్షణ