శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకారం అందిస్తాం: గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి 

శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకారం అందిస్తాం: గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి 

షాబాద్,(రంగారెడ్డి): షాబాద్ మండల పరిధిలోని రుద్రారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి మంగళవారం షాబాద్ సీఐ లక్ష్మీ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఇటీవల షాబాద్ పోలీస్ స్టేషన్‌లో బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేపడుతున్న చర్యలను అభినందిస్తూ, ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలని కోరారు.ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖకు తమ వంతు సహకారం అందిస్తామని గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో బి సి సేన షాబాద్ మండల విభజన విభాగం అధ్యక్షుడు బండ అజయ్ కుమార్, తిరుపతి రెడ్డి, ఆనంద్,బండి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News