గురు పౌర్ణమి సందర్భంగా ఉపాధ్యాయులకు ఘన సన్మానం
చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో గురు పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మహేష్ యాదవ్ మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల సేవలు అమూల్యమైనవని, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం గురువులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంటి గీతా రమేష్, ఉప సర్పంచ్ మహేష్ యాదవ్, పంచాయతీ కార్యదర్శి పావని, మంగలి మహేష్, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Views: 18
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
