మార్పు కోసం జనసేన..!

గడల శ్రీనివాసరావుకు కొత్తగూడెం జనసేన పార్టీ టికెట్..! 

1001262164
 
కొత్తగూడెం సభతో ఎన్నికల సమరానికి శ్రీకారం... 200 మంది పార్టీలో చేరిక...
 
కొత్తగూడెం :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లోని చుంచుపల్లి మండలంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్‌లో జనసేన పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ శ్రేణులు, యువత, మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతంపై నాయకత్వం స్పష్టమైన కార్యాచరణను ప్రకటించింది. సమావేశానికి ముందు చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన జనసేన జిల్లా పార్టీ కార్యాలయాన్ని జనసేన జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యాలయం ప్రారంభం అనంతరం కొత్తగూడెం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది కార్యకర్తలు, యువకులు ద్విచక్ర వాహనాలతో పాల్గొని పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ చేపట్టారు. జనసేన జెండాలు, పవన్ కళ్యాణ్ చిత్రాలతో కూడిన బ్యానర్లు, నినాదాలతో పట్టణమంతా సందడిగా మారింది. ర్యాలీ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన నాయకులు అనంతరం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం సాధన కోసం జనసేన కృషి చేస్తుందని నాయకులు పేర్కొన్నారు.
 
1001262576
- గ్యాప్ రాలేదు... గ్యాప్ తీసుకున్నాను : గడల శ్రీనివాస్
తదనంతరం శ్రీరామ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఆత్మీయ సమావేశంలో జనసేన జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి,రాష్ట్ర ఇన్‌చార్జి శంకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి ఆర్.కే. సాగర్, మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు, రాష్ట్ర,జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ తదితర పార్టీలకు చెందిన సుమారు 200 మంది యువకులు, మహిళలు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి నాయకులు ఘనంగా ఆహ్వానించారు. కొత్తగా పార్టీలో చేరిన వారు జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. సమావేశంలో  మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు భావోద్వేగంగా ప్రసంగించారు. గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో కనిపించకపోవడంతో చాలామంది తాను రాజకీయాలకు దూరమయ్యానని భావించారని అన్నారు. అయితే రాజకీయాలకు గ్యాప్ రాలేదని, నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకత్వం కోసం తానే స్వచ్ఛందంగా రాజకీయాలకు కొంత విరామం ఇచ్చానని స్పష్టం చేశారు. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే నాయకుడి కోసం ఎదురు చూశాను. అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటం, యువత కోసం తీసుకుంటున్న కార్యక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా ఆయన అవలంబిస్తున్న వైఖరి నన్ను ఆకట్టుకున్నాయి. అందుకే జనసేన పార్టీలో చేరాననీ ప్రజా సేవే నా లక్ష్యం అని కొత్తగూడెం నా స్వస్థలం ఈ ప్రాంత ప్రజలతో నాకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మరింత సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని గడల శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమైందని,ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ తెలంగాణ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
 
1001262204
- తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే పార్టీకే మద్దతు : రామ్ తాళ్లూరి
జనసేన జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తెలంగాణలో సామాజిక న్యాయం సాధించాలంటే రాజకీయ అధికారంలో బీసీలకు సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే పార్టీకే జనసేన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత ముఖ్యమంత్రి హామీని నెరవేర్చలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన అనేక హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగం, రైతుల సమస్యలు, యువతకు ఉపాధి అవకాశాల కొరత వంటి అంశాలపై ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు.
 
1001262161
ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్.కే. సాగర్, సినీనటుడు తనీష్ మాట్లాడుతూ..  కొత్తగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తామని చెప్పారు.ప్రతి గ్రామంలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో జనసేన జెండాను కొత్తగూడెంలో ఎగురవేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావును కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు నాయకులు వెల్లడించారు. ఈ ప్రకటనతో సభా ప్రాంగణం హర్షధ్వానాలతో మారుమోగింది. కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గడల శ్రీనివాసరావుకు అభినందనలు తెలిపారు. కార్మిక ప్రాంతంలో డాక్టర్ గడల శ్రీనివాసరావు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని నాయకులు కొనియాడారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత కోసం నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా సుమారు 70 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. వైద్య రంగంలోనూ,సామాజిక సేవలోనూ విశేష సేవలు అందించిన వ్యక్తిగా ప్రజల్లో మంచి గుర్తింపు పొందారని తెలిపారు.రానున్న రోజుల్లో స్థానిక ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తూ జనసేనను ప్రజల్లోకి తీసుకెళ్తామని నాయకులు స్పష్టం చేశారు. ప్రతి ఎన్నికలోనూ జనసేన అభ్యర్థులను నిలబెట్టి విజయానికి కృషి చేస్తామని, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు రాము యాదవ్, ప్రచార కార్యదర్శి ఆర్.కే.సాగర్, టీ. శ్రీనివాసరావు, సినీనటుడు తనీష్, హసీనా, జయశ్రీ, ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి మిర్యాల రామకృష్ణ, నరేష్, సాదిక్ తదితర నాయకులు పాల్గొన్నారు.అలాగే జిల్లాలోని వివిధ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు, మహిళలు, యువత, పవన్ కళ్యాణ్ అభిమానులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. సభా ప్రాంగణం మొత్తం జనసేన జెండాలు, నినాదాలు, కార్యకర్తల సందడితో రాజకీయ ఉత్సాహాన్ని తలపించింది.
Views: 131

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అభివృద్ధి పనుల్లో లోపిస్తున్న నాణ్యత ..? అభివృద్ధి పనుల్లో లోపిస్తున్న నాణ్యత ..?
మందమర్రి : మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న పనుల్లో నాణ్యత లోపిస్తుంది. పనుల నాణ్యతను పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. రోడ్లు,డ్రైనేజీలు,ఇతర మౌలిక వసతుల...
26 న గాంధారి ఖిల్లా మైసమ్మ బోనాల జాతర
చేబర్తి మొదటి వార్డులో వీడని రోడ్డు కష్టాలు
కలలకు రెక్కలు తొడిగిన దంపతులు.. ప్రతిభావంతులైన విద్యార్థులకు తొలి విమానయానం
కలెక్టర్ గారు జరా చూడండ్రీ..!
మార్పు కోసం జనసేన..!
అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...