తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మొహమ్మద్ ముస్తాక్ నేహాల్..
హన్మకొండ న్యూస్ : హన్మకొండ 58 వ డివిజన్ కు చెందిన మొహమ్మద్ ముస్తాక్ నేహాల్ ను సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా విభాగం చైర్మన్ నవీన్ పెట్టెం ఉత్తర్వులు జారి చేసారు.
మొహమ్మద్ ముస్తాక్ నేహాల్ గతంలో యూత్ కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ గా, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, సోషల్ మీడియా వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్ గా, హన్మకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పని చేసారు. ఈ సందర్భంగా మొహమ్మద్ ముస్తాక్ నేహాల్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాకు ఈ గౌరవప్రదమైన బాధ్యతను అప్పగించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా విభాగం చైర్మన్ నవీన్ పెట్టెం గారికి, నాకు ఈ పదవి రావడానికి సహకరించిన వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారికి మరియు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇనగాల వెంకట్రాం రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.నాకు అప్పగించిన ఈ పదవికి పూర్తి న్యాయం చేస్తానని, పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తానని, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


