ఎర్రకుంట తండాలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

- జెండా ఎగరవేసిన సర్పంచ్ కృష్ణా నాయక్

ఎర్రకుంట తండాలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఎర్రకుంట తండాలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ కృష్ణా నాయక్ జాతీయ జెండాను ఎగరవేసి జెండా వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి, అమరవీరుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడం చారిత్రక ఘట్టమని, నిజాం నిరంకుశ పాలన నుండి ప్రజలకు విముక్తి లభించిన రోజు ఇదేనన్నారు. ప్రజా పాలన స్ఫూర్తితో గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ విజయ్ కుమార్, వార్డు సభ్యులు శ్రీను, రఘు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పంచాయతీ సిబ్బంది, అంగన్ వాడీ టీచర్లు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News